రాజు 9వ తరగతి చదువుతున్నాడు. అతడు అన్ని సబ్జెక్టులలోనూ తెలివైన విద్యార్థి. కానీ హిందీలో చాలా వీక్. కారణం హిందీ అంటే అతడికి చులకన భావం. 10వ తరగతి తర్వాత హిందీలో పని లేదు కదా! 20 శాతం మార్కులు వస్తే పాస్. ఈ హిందీతో తలనొప్పి ఎందుకు? అనుకునే వాడు. రాజు చెల్లెలు శ్రుతి 7వ తరగతి అమ్మాయి. అన్ని సబ్జెక్టులలో చాలా తెలివైన అమ్మాయి. టి.వీ.లలో వచ్చే చెత్తా చెదారం చూడకుండా హిందీలో మంచి కామెడీ ప్రోగ్రామ్స్ వస్తుంటే చూస్తున్నది. అలాగే హిందీలో నవ్వించే సినిమాలు వస్తున్నా చూసే అలవాటు ఉంది శ్రుతికి. ఆ విధంగా 7వ తరగతికే హిందీ భాషను బాగా అర్థం చేసుకునే తెలివి తేటలు సంపాదించుకుంది శ్రుతి.
ఒకరోజు శ్రుతి టీవీలో ఒక వినోదాత్మక కార్యక్రమం చూస్తుంది. మధ్య మధ్యలో బాగా నవ్వుతుంది శ్రుతి. అక్కడే ఉన్న నాయనమ్మ కారణం అడిగేది. చెప్పేది శ్రుతి. ఒకరోజు శ్రుతికి నాయనమ్మ మీద బీభత్సమైన కోపం వచ్చింది. టీవీ చూస్తూ నవ్వుతుంది శ్రుతి. నాయనమ్మతో మాటలు లేవు కదా! "ఏం జరిగింది మనవడా!" అని అడిగింది. మనోడికి హిందీ అర్ధం కాదు కదా! ఏదో కవరింగ్ ఇచ్చాడు. పగలబడి నవ్వింది శ్రుతి. రాజు అవమానంతో అక్కడ నుంచి వెళ్ళిపోయాడు.
రాజు ఇంటి పక్కన ఉన్న వారు వారం రోజుల పాటు ఉత్తర భారత దేశంలోని ప్రసిద్ధమైన ప్రాంతాలు చూసి రావాలని అనుకున్నారు. తమతో పాటు ఒకరికి రావడానికి అవకాశం ఉందని, రాజును పంపమని అడుగుతారు. "మా అబ్బాయి రాము మీ అబ్బాయి రాజు మంచి స్నేహితులు కదా! పంపుమ"ని అడుగుతారు. "మీరు వెళ్లేది. నార్త్ ఇండియా. అక్కడ హిందీ బాగా తెలిసి ఉండాలి. మా వాడికి హిందీలో జ్ఞానం సున్నా. మా అమ్మాయి శ్రుతికి హిందీ బాగా అర్థం అవుతుంది. పైగా మా అమ్మాయి శ్రుతి, మీ అమ్మాయి లయ మంచి స్నేహితులు కదా! మా అమ్మాయిని పంపుతారు." అన్నది శ్రుతి తల్లి శ్రావణి. రాజు సిగ్గుతో తల దించుకున్నాడు.
ఆ తరువాత కొద్ది రోజులకు తన బాధను రాముకు చెప్పుకున్నాడు రాజు. అప్పుడు రాము ఇలా అన్నాడు. "ఇకనైనా హిందీ విలువ తెలిసుకో. మనం బావిలో కప్పల్లాగా ఎప్పుడూ మన ప్రాంతంలోనే ఉండబోము. అత్యవసరమైన పని మీద ఇతర రాష్ట్రాలకూ వెళ్లవచ్చు. అప్పుడు మన ప్రాంతీయ భాష ఉపయోగపడదు కదా!. మోసాలకు, అవమానాలకూ గురి కావలసి వస్తుంది. అందుకే హిందీ భాషను నేర్చుకోమని చెప్పారు. కేవలం పాస్ కావడం కోసం హిందీ నేర్చుకోమని అనలేదు. అది మన జాతీయ భాష. నేర్చుకుంటే మన దేశంలో ఎక్కడైనా తిరిగి రావచ్చు. లేకపోతే మాతృ దేశంలో పరాయి వారుగా మసం అవమానాలకు గురి కావలసి వస్తుంది." అన్నాడు రాము. వాసుకు కనువిప్పు కలిగింది. పట్టుదలతో హిందీ క్షుణ్ణంగా నేర్చుకున్నాడు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి