17.
ఏడు కొండల నెక్కి చూచిన నేల దర్శనమీయవో?
గోడులన్నియు విన్నవించగ కోరి వస్తిమి భక్తితో!
వేడుకున్నను తెర్వుజూపరు వేంకటేశ్వర! మీ భటుల్
మేడమై యిట వేచియుంటిమి మేలుకో ధరనేలుకో!
నిఘంటువు:
తెర్వు= దారి
మేడము= కూడియుండి(సమూహం)
18.
మంచుతోఁ దల ముగ్గు బుట్టయె, మందబారెను దేహమే
సంచితంబగు పాపమేదియొ సాచి కొట్టెను చెంపపై
నెంచి చూడగ మీదు దర్శనమింత దుర్లభమేమిటో?
మంచి సామివె, నిద్ర చాలును మేలుకో ధరనేలుకో!
----------------------------------------
నిఘంటువు:
సంచిత=పోగుబడిన
ఎంచి= లెక్కించి
-------------------------------------
డాక్టర్ అడిగొప్పుల సదయ్య
వ్యవస్థాపక అధ్యక్షుడు
మహతీ సాహితీ కవిసంగమం
కరీంనగరం
9963991125
మేలుకొలుపులు(మత్తకోకిల)-డాక్టర్ అడిగొప్పుల సదయ్య
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి