నింగిని రేయిన వెలిగిన తార
జగాన్ని ఉదయాన చూడాలని
ఊగుతున్న తీగకు పువ్వుగా
ఊరించు కోరిక తీరగా విరిసె!
కురిసిన తుహిన బిందువుల
జారిపోగా మిగిలిన ఒక్కదానిని
ఒడిసి పట్టిన పర్ణపు చివర
కిరణము తాకి వర్ణాలు తోచె!
నులివెచ్చగా తాకే
తొలికిరణపు జాడ
తాకి రేకులు విరియ
మోదముమీర నవ్వులు పూయించే!
కదిలివచ్చు దినకరుని
కరుణ చూసి కనులు నిండి
కరములు జోడించి
కదలికల కుసుమము
వందనములిడే!
ఆకాశము నీడ అవని ఇల్లు
అందరూ తనవారే ఒరులు లేరు
ఎల్లరి క్షేమము కోరు మనము
పువ్వులు వేలు తెల్లగా నవ్వు వనమే!
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి