"పన్నీటి బొట్లు": - డాక్టర్ సి వసుంధర చెన్నై.
ఎదుటివాడి మనసు 
చదవడం నేర్చుకో 
ఆ తర్వాతే పుస్తక పఠనం. 

ఒకరు చెప్పేది,ముందు శ్రద్ధగా విను. 
తర్వాత నీవు మాట్లాడు, అపార్ధాలు రావు.

 ఉప్పెనలా వస్తుంది చెప్పాలన్న తపన.
తప్పదు, ఆపుకోవాలి అర్ధ వివరణ కోసం. 

చెప్పాలనుకున్న విషయం, 
నేతిలో కాల్చిన 
అరిసెలా మెత్తగా, మధురంగా ఉంటే బాగుంటుంది.

కవిత, సమస్యకు పరిష్కార మార్గం 
చూపాలి. 
ఓ రిపోర్టులా ఉంటే 
ఆ విషయానికి సపోర్ట్ ఎలా అవుతుంది చెప్పండి.

కామెంట్‌లు