సాహితీప్రయాణం:- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
కవితాలోకమందు
కాలుపెడతా
కాలక్షేపంచేస్తా

అక్షరాలను
నీళ్ళలో కలుపుతా
కవితాసాగరమంటా

పదాలను
గాలిలో విసురుతా
కవనవీచికలంటా

విషయాలను
నదిలో వదులుతా
కైతాప్రవాహమంటా

ఆలోచనలను
కాగితాలకెక్కిస్తా
కయితాపుస్తకమంటా

భావాలను
బయటకు క్రక్కుతా
భావకవితలంటా

వాక్యాలను
కలముతో కారుస్తా
వచనకవితలంటా

రాతలను
పత్రికలకిస్తా ప్రచురిస్తే
మహాకవినంటా

కవిసమ్మేళనాలకు
హాజరవుతా శాలువాకప్పించుకుంటా
మహాసత్కారంచేశారంటా

పిలిస్తే 
అతిధిగా వేదికలెక్కుతా
ఉపన్యాసాలుదంచేస్తా

సాహితీప్రయాణం
కొనసాగిస్తా
సరస్వతీపుత్రుడునంటా


కామెంట్‌లు