భద్రత ప్రశ్నార్థకం :-సి.హెచ్.ప్రతాప్
 విద్యార్థులను బడికి చేర్చే ఆటోలు భద్రత ప్రశ్నార్ధకంగా మారింది. ఆటో డ్రైవర్ల ఆత్యాస తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తోంది.ప్రయివేట్‌ బస్సులకు ఫీజులు చెల్లించే స్థోమత లేని కారణంగా తప్పని పరిస్థితుల్లో తల్లిదండ్రులు తమ పిల్లలను ఆటోలో పంపించాల్సి వస్తోంది. అట్లే పల్లెల నుంచి ఆర్‌టిసి బస్సులు లేకపోవడంతో తల్లిదండ్రులు ఆటోలను ఆశ్రయిస్తున్నారు. ఆటో డ్రైవర్ల ఆత్యాస తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తోంది. ప్రధాన పట్టణాల్లో ఉదయం 9 గంటల లోపు సాయంత్రం 4 గంటల తర్వాత నగర వీధుల్లో కిక్కిరిసిన బడి ఆటోలు దర్శనమిస్తున్నాయి. ఒకొక్క ఆటోలో కనీసం 10 నుంచి 14 మంది విద్యార్థులను ఎక్కిస్తున్నారు.స్కూలుకు చేర్చే ప్రైవేట్‌ వాహనాలపై ఆ తరహా పర్యవేక్షణ లేకపోవటం కలవరానికి గురిచేస్తోంది. అతి వేగం, ఎంత మంది పిల్లలను ఎక్కిస్తే అంత ఆదాయం అనే ఆలోచనలోనే డ్రైవర్లు ఉంటున్నారు. ఇదే ప్రమాదాలకు ముఖ్యకారణంగా మారుతోంది. స్కూలు పిల్లలను బడికి చేర్చేందుక ఆటోలకు రవాణా శాఖ నుంచి ప్రత్యేకమైన అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదు. దీంతో ఆటో డ్రైవర్లు యదేచ్ఛగా ప్రవర్తిస్తున్నారు.బంధనలకు విరుద్ధంగా విద్యార్థులను కుక్కి అతివేగంగా డ్రైవర్లు ఆటోలను తోలుతున్నారు. ఒకవైపు పాఠశాల సమయం ముగుస్తుందని గేటు వేస్తారని ముందు వెనక చూసుకోకుండా దూసుకు వస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. అధికారుల నియంత్రణ లేకపోవడం, తల్లిదండ్రులు, పాఠశాలల యాజమాన్యాల నిర్లక్ష్యంతో పాఠశాలల ఆటోలు ప్రమాదకరంగా మారుతున్నాయి.
రాష్ట్రంలో  ప్రధాన పట్టణాల్లో ఉదయం 9 గంటల లోపు సాయంత్రం 4 గంటల తర్వాత నగర వీధుల్లో కిక్కిరిసిన బడి ఆటోలు దర్శనమిస్తున్నాయి. ఒకొక్క ఆటోలో కనీసం 10 నుంచి 14 మంది విద్యార్థులను కుక్కెస్తున్నారు.రవాణా శాఖ అధికారుల పర్యవేక్షణ ఉండటంతో స్కూలు బస్సులను ప్రతి ఏటా వాహనాల తనిఖీలు, ఎన్‌ఓసీ సర్టిఫికెట్లు జారీ చేసిన అనంతరమే విద్యార్థుల ప్రయాణాలకు వినియోగిస్తున్నారు. స్కూల్‌కు చేర్చే ప్రయివేట్‌ వాహనాలపై ఆ తరహా పర్యవేక్షణ లేకపోవటం కలవరానికి గురిచేస్తోంది.అతి వేగం, ఎంత మంది పిల్లలను ఎక్కిస్తే అంత ఆదాయం అనే డ్రైవర్ల ఆలోచన కారణం ప్రమాదాలకు ముఖ్యకారణంగా మారుతుంది.ఆటో సమాచారాన్ని సంబంధిత పాఠశాలలకు తల్లిదండ్రులే అందించాలి. స్కూల్‌ యాజమాన్యాలు, సిబ్బంది కూడా వారి స్కూళ్లకు ఎక్కువ మంది పిల్లలను తీసుకువచ్చే ఆటోలను అనుమతించకూడదు. 

కామెంట్‌లు