సాయుధ పోరాటంతోనే స్వరాజస్థాపన సాధ్యమంటూ అహర్నిశలు కృషిచేసిన భారత జాతీయ సైన్యాధినేత సుభాష్ చంద్రబోస్ అని పాతపొన్నుటూరు యుపి పాఠశాల ప్రధానోపాధ్యాయులు గుర్రాల కృష్ణారావు అన్నారు. సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా పాఠశాలలో ఏర్పరిచిన కార్యక్రమానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ మహాత్మాగాంధీ సందేశం ఇచ్చిన అహింసవాదంతో పాటు, పోరుబాట కూడా అవసరమే అంటూ ప్రజలను చైతన్యపరిచిన మహాశక్తి సుభాష్ చంద్రబోస్ అని అన్నారు. ఉపాధ్యాయులు అందవరపు రాజేష్ మాట్లాడుతూ భారత యుద్ధ ఖైదీలు, రబ్బరు తోట కూలీలు, ఇతర ఔత్సాహికులతో సైన్యాన్ని ఏర్పరిచిన మహా యోధుడు సుభాష్ చంద్రబోస్ అని అన్నారు. ఇందుకోసం రష్యా, జపాన్, జర్మనీ మొదలగు దేశాలు పర్యటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఉపాధ్యాయులు బూడిద సంతోష్ కుమార్ మాట్లాడుతూ గాంధీజీ నిర్దేశాలతో కలకత్తా వెళ్లి చిత్తరంజన్ దాస్ సహకారంతో బెంగాల్ ఉద్యమాన్ని నిర్వహించిన ఘనాపాటి సుభాష్ అని అన్నారు. స్వాతంత్రం రావాలంటే ఇతర దేశాల సహకారం, దౌత్య సమర్ధన అవసరమని చాటిన వ్యక్తి సుభాష్ అని ఆయన అన్నారు. ఉపాధ్యాయులు పైసక్కి చంద్రశేఖరం మాట్లాడుతూ తమపై నిరసనలు వ్యక్తం చేస్తున్న సుభాష్ చంద్రబోస్ ని ఎలాగైనా మట్టు పెట్టాలని కుట్రలు చేస్తున్న బ్రిటిష్ వారికి చిక్కకుండా అనేక విధాలైన మారువేషాల్లో తప్పించుకుంటూ, దేశదేశాలను దాటుకుంటూ మిక్కిలి ధైర్యాన్ని ప్రదర్శించి, స్వాతంత్ర్య సాధనే ధ్యేయంగా ఎన్నో ఒడిదుడుకులను అధిగమించిన తపస్వి సుభాష్ చంద్రబోస్ అని అన్నారు. ఉపాధ్యాయని యిసై సౌజన్యవతి మాట్లాడుతూ అగ్రరాజ్యాలకు బందీ కాబడిన వేలాదిమంది భారతీయ సైనికుల్ని కలిసి వారితో ఇండియన్ లెజియన్ స్థాపించిన దళపతి సుభాష్ అని అన్నారు. ఉపాధ్యాయులు బొమ్మాళి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఒరిస్సా కటక్ లో 1897 జనవరి 13న ధనిక కుటుంబంలో జన్మించిననూ, పెద్ద చదువులు చదివి గొప్ప ఉద్యోగ అవకాశాలను లభించిననూ వాటిని వదులుకొని దేశంకోసం అంకితమైన భారతమాత ముద్దుబిడ్డ మన సుభాష్ చంద్రబోస్ అని అన్నారు. 1945 ఆగస్టు 18న తైవాన్ లో జరిగిన విమాన ప్రమాదంలో సుభాష్ చంద్రబోస్ మరణించి ఉంటారన్న అనుమానం ఇప్పటికీ అలాగే వివాదాస్పదంగా మిగిలిపోయిందని ఆయన వివరించారు. ఉపాధ్యాయులు కుదమ తిరుమలరావు మాట్లాడుతూ దేశం కోసం ప్రాణత్యాగానికి సిద్ధమై, యువతకు స్ఫూర్తిని కలిగించి, ప్రజలకు పౌరుషాగ్ని రగిలించి, భారతీయులకు ఆదర్శంగా నిలిచిన గొప్ప స్వాతంత్ర సమరయోధుడు, దేశభక్తుడు సుభాస్ చంద్రబోస్ అని అన్నారు. తొలుత ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు బోస్ చిత్రపటానికి పుష్పాలతో నివాళులర్పించి విద్యార్థులందరిచే సెల్యూట్ గావించారు. అనంతరం మిఠాయి పంపడం జరిగింది.
భారత జాతీయ సైన్యాధ్యక్షుడు సుభాష్ చంద్రబోస్

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి