అతడు మాటకారి
అతని మాటలు
ఆకర్షిస్తాయి
అంతరంగాలు
అతడు మాటనేర్పరి
అతని మాటలు
అందిస్తాయి
ఆనందాలు
అతడు మాటలగారడి
అతన మాటలు
కలిగుంటాయి
లయబద్ధతను
అతడు మాటలమాంత్రికుడు
అతని మాటలు
చూపుతాయి
పాదనియమాలను
అతడు మాటలమరాఠి
అతని మాటలు
విసురుతాయి
చమక్కులు
అతడు మాటలపొదుపరి
అతని మాటలు
తక్కువపదాలతో ఇస్తాయి
ఎక్కువ అర్ధాలు
అతడు మాటలదిట్ట
అతనిమాటలు
చిందుతాయి
తేనెచుక్కలు
అతడు మాటమనిషి
అతని మాటలు
కుదుర్చుతాయి
మంచినమ్మకము
అతడు అందుకే
కవివర్యుడు
అతని కవితలు
అద్భుతాలు
మనమూ నేర్చుకుందామా
మాటలచాతుర్యము
మనమూ ప్రదర్శించుదామా
మాటలమహత్యము
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి