నమ్మకం...!!--షాహీన్ సిద్దిఖా.- నల్లగొండ.
 అతడు 
ఎప్పటికీ రాడని 
తెలిసి కూడా -
నా పిచ్చిమనసు పదే పదే 
అతడే కావాలంటుంది!
మనిషిని -
సముజాయించొచ్చు....
కానీ .....మనసుని
సముజాయించలేము!
అయినా ఇంకా --
అతడిపై నమ్మకంతో 
ఎదురుచూస్తూనే ఉంది
నా.. మనసు....!
ఎక్కడో గుండె మారుమూల
నమ్మకం వెంటాడుతూనే ఉంది,
ఎప్పటికైనా అతడు వస్తాడని
తన కౌగిలిలో బంధి స్తాడని,
తన ప్రేమతో 
ఉక్కిరి బిక్కిరి చేస్తాడని 
నా పిచ్చి మనసుకునమ్మకం!
చూడాలి మరి -
నా మనసు కోరిక తీరేనా.....!!
                  ***

కామెంట్‌లు