కూరలు ఆరోగ్యం.. సాయికిరణ్

 -ఇప్పుడు కాలీఫ్లవర్ బాగా వస్తోంది.కానీ దీనివల్ల గ్యాస్ ఎసిడిటీ కడుపులో మంట తప్పదు.థైరాయిడ్ కిడ్నీలో సమస్యలు బ్లడ్ క్లాటింగ్ గర్భవతులు తినకపోవడం ఉత్తమం.
-ఆకుపచ్చఖీరా ఏ కాలంలోనైనా తింటే చాలా ఆరోగ్యం.డయాబిటీస్ బరువు కంట్రోల్ కాన్సర్ నివారణ నోటి దంతాలు చిగుళ్ళు గట్టిదనానికి జీర్ణ శక్తికి కంటికి జాయింట్ పెయిన్స్ కి దివ్యౌషధం ఖీరా.
-చిలగడ దుంప స్వీట్ పొటాటో ని ఉడకబెట్టి కాల్చుకుని తింటే పిల్లల కి చాలా మంచిది.జీర్ణశక్తి పెంచుతుంది.గర్భవతులు తింటే పిండంకి మంచిబలం శక్తి కూడా.బి.పి.షుగర్ కంట్రోల్ హెమోగ్లోబిన్ బాగా లభిస్తుంది.కాబోయేతల్లికి‌మార్నింగ్ సిక్నెస్ ఉండదు.
-తమలపాకు కషాయంతో అరుగుదల శ్వాస సంబంధిత రోగాలు లావెక్కడం ఉండదు.జీర్ణశక్తి పెరుగుతుంది.చాయ్ లో తమలపాకు వేసి మరిగించి తాగితే జలుబు దగ్గు దూరం.
-లవంగాలు నిమ్మరసం కలిపి సేవిస్తే చాలా రోగాలు మాయం అవుతాయి.నిమ్మముక్కలు లవంగం నీటిలో వేసి రాత్రంతా నానేసి మర్నాడు    పొద్దున్నే తాగాలి.ఊపిరితీసుకోటంలో సమస్యలు కీళ్ల నొప్పులు తగ్గిపోతాయి. చలికాలంలో తెల్ల నువ్వులు తినాలి.అందుకే మనం సంక్రాంతికి నువ్వుల అరిసెలు నువ్వులు పుట్నాలపప్పు బెల్లం కల్పితింటాం.పంచుతాం.గుండెజబ్బు ఆర్థరైటిస్ కి దివ్యౌషధం.🌹
కామెంట్‌లు