న్యాయాలు-738
సాక మేధీయ న్యాయము
*****
సాక మేధీయము అనేది చాతుర్మాస్య వ్రతాలు, యాగాలలో ఒకటి.
మరి వ్రతము అంటే మనందరికీ తెలిసిందే. ప్రతిజ్ఞ, సంకల్పం, భక్తి.దైవాన్ని ఆరాధించే, ప్రార్థించే ఓ ముఖ్యమైన కార్యక్రమము. పుణ్య సాధన కోసం ఉపవాసాది నియమాలతో చేసే కార్యాన్ని వ్రతం అంటారు. ఇది ఒక ధర్మబద్ధమైన ఆచారము. సత్యనారాయణ స్వామి వ్రతము,కేదారేశ్వర, వరలక్ష్మీ వ్రతము మొదలైనవి.
పురాణేతిహాసాల ప్రకారం వ్రతాలు మూడు ప్రాథమిక మరియు అనేక ద్వితీయ వర్గాలుగా విభజించబడ్డాయి.ఇందులో నిత్యం చేసే వ్రతాలు.అప్పుడప్పుడు ప్రత్యేక సందర్భాల్లో చేసే వ్రతాలు, కోరికలు సిద్ధించడం కోసం చేసే వ్రతాలు. ద్వితీయ వర్గాలలో తిథి,వార,నక్షత్ర, యోగ,కరణ,పక్ష,మాస,వర్ష,ఏక్భుక్త,నక్త,అయాచిత మరియు మిత్భుక ఆహారానికి సంబంధించిన వ్రతాలు.
ఇక వ్రతాలు అంటే ఏమిటో తెలిసాయి. మరి ఇందులో సాక మేధీయము లేక సాకమేధులు అంటే ఏమిటో చూద్దాం.
మరి ఈ వ్రతాలు నాలుగేసి నెలలకు ఒకసారి సంవత్సరమునకు మూడు సార్లు చేస్తుంటారు. వసంత ఋతువులో,వర్ష ఋతువులో, హేమంత ఋతువులో చేసే వ్రతాలు వీటిని చాతుర్మాస్య వ్రతాలు అంటారు. ఇవి యుగయుగాలుగా ఆచరణలో ఉన్నాయని భవిష్య, స్కాంద పురాణాలలోని కథనాల వల్ల తెలుసుకోవచ్చు.
ఇంతకు ముందు సంవత్సరంలోని మొత్తం నెలలను నాలుగు నెలలకు ఒకటి చొప్పున మూడు ఋతువులుగానే లెక్కించే వారు. తర్వాత్తర్వాత ఆరు ఋతువులుగా పరిగణించడం మొదలు పెట్టారు.
అయితే ఈ సాకమేధులకూ వీటికి సంబంధం ఏమిటబ్బా! ముక్కేదంటే సూటిగా చెప్పకుండా ఈ డొంకతిరుగుడు ఏమిటి? అనిపిస్తుంది కదండీ!కానీ ఉంది కాబట్టే ఇదంతా చెప్పుకోవాల్సి వస్తోంది.
ఇక అసలు విషయానికి వస్తాను.చాతుర్మాస్య వ్రతాలని చెప్పుకున్నాం కదా! వీటిని మొదట్లో యజ్ఞాలని అనేవారట .ఇలా ఒక్కో ఋతువు ఆరంభమయ్యే కాలంలో ఒక్కో యజ్ఞం చేస్తుండే వారట.ఆషాఢ పూర్ణిమ నుండి వరుణ ప్రఘాస యజ్ఞం,కార్తీక పౌర్ణమి నుండి సాక మేద యజ్ఞం, ఫాల్గుణ పౌర్ణమి నుండి వైశ్వ దేవ యజ్ఞం చేస్తూ వుండేవారట. ఇవే తర్వాత కాలంలో చాతుర్మాస్య వ్రతాలుగా మారాయి. ఇందులో ఏడు వ్రతాలను అంతర్భాగాలుగా చేర్చడంతో పాటు వాటిని సాకమేధులుగా పరిగణిస్తూ చెప్పడం జరిగింది.అయితే ఈ సాకమేధుల ప్రారంభం, ముగింపు రోజుల విషయమై విధిజ్ఞులలో కొన్ని భేదాభిప్రాయాలు ఉన్నాయట.
ఈ సాక మేధులలోని వ్రతాలు చేసేవారు వాటికి సంబంధించిన వివరాలు కూలంకషంగా విధిజ్ఞుల ద్వారా తెలుసుకోవాలి సుమా. ఒక్కో వ్రతానికి ఒక్కో విధి విధానం వుంటుంది. ఇదండీ!సాకమేధుల కథా కమామీషు..
వీటిని తిథి వార నక్షత్ర యోగ కరణ పక్ష మాస వారీగా వారి వారి వీలును సంస్కృతీ సంప్రదాయాలను అనుసరించి చేసుకుంటూ ఉంటారు.
ఇంతకూ వీటిని ఆచరించుటలోని అంతరార్థం ఏమిటంటే భక్తి, విశ్వాసం, సంకల్ప శక్తిని దృఢపరుస్తాయి.ఈ ఉపవాసాలు ఉండటం,సమయంలో సాత్విక ఆహారం తీసుకోవడం వల్ల మనసు సాత్త్విక భావనతో నిండటమే కాకుండా శక్తినీ, ఆరోగ్యాన్ని,సుఖ సంతోషాలనూ కలిగిస్తాయి.అంతే కాకుండా "ధర్మార్థ కామ మోక్షాణాం ఆరోగ్యం మూలముత్తమం " అని చరక సంహిత కూడా చెబుతోంది కదా!.
మరింకెందుకు ఆలస్యం. వీలును బట్టి ఆచరిద్దాం. శారీరక, మానసిక ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని పొందుదాం.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి