అనగనగా ఒక ఊరిలో అమృత, తేజ అనే ఇద్దరు భార్యాభర్తలు ఉండేవారు, వాళ్ళిద్దరూ డాక్టర్స్ ఒకరోజు వాళ్ళిద్దరూ బంధువుల పెళ్ళికి వెళ్లి వస్తుండగా వారి కారు ఆగిపోయింది, చీకటి పడడంతో ఆ రూట్ లో ఎవరూ లేరు, వారు దేవుణ్ణి తలుచుకున్నారు అప్పుడే అటువైపుగా బైక్ పై ఒక వ్యక్తి వచ్చాడు ఆ వ్యక్తికి ఆగి వాళ్ళ దగ్గరకు వచ్చి ఏమైంది, అని అడిగాడు అప్పుడు వాళ్లు కారు ఆగిపోయిందని చెప్పారు, అప్పుడు ఆ వ్యక్తి నేను ఒక మెకానిక్ ని అని చెప్పి తన దగ్గర ఉన్నటువంటి బాక్స్ నుంచి వస్తువులు తీసి చాలాసేపు శ్రమించి కారు రిపేర్ చేశాడు, అప్పుడు అమృత తేజ మీకు ఎంత డబ్బులు ఇవ్వాలి అని అడిగారు, దానికి ఆ వ్యక్తి నాకు డబ్బులు వద్దు అని అన్నాడు ఎందుకని వాళ్ళు
అడిగిండు అతను మా గురువుగారు చెప్పారు ఆపదలో ఉన్న వారిని ఆదుకోవా లని చెప్పారు, అందుకే నాకు డబ్బులు వద్దు అన్నాను కొన్ని సంవత్సరాల తరువాత అతనికి ఆక్సిడెంట్ జరుగుతుంది, తన భార్య వైద్యానికి డబ్బులు లేక నార్మల్ హాస్పిటల్ కు తీసుకెళ్తుంది అక్కడ వైద్యులు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి తీసుకెళ్లాలి అని చెబుతారు తన భార్య సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి తీసుకొని వెళ్తుంది, అప్పుడు డాక్టర్ మెకానిక్ ని చూసి వాళ్లకు చేసిన సాయం గుర్తుకు వచ్చి, అతనికి ఉచితంగా వైద్యం చేసి చాలా కష్టపడి అతన్ని బ్రతికిస్తాడు మెకానిక్ కి మేలుకువ వచ్చింది, తర్వాత అతను తన దగ్గర డబ్బులు ఇస్తుండగా డాక్టర్ చెబుతారు అప్పుడు డాక్టర్ వద్దు నువ్వు చేసిన సాయం ముందు చేసిన సహాయం గుర్తుంది ఆరోజు నువ్వు మాకు ప్రాణం దానం చేశావు అందుకే ఈరోజు నీకు మేము ఉచితంగా వైద్యం చేసాము.
నీతి: ఒకరు మనకు సహాయం చేస్తే మరల మనకు సహాయం లభిస్తుంది
మానవత్వం :- ఏ.సృజన-ఎనిమిదవ తరగతి-ఆదర్శ పాఠశాల వల్లాల
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి