పల్లవి :-
పరస్పర సహకార,సహజీ వన సమాజం లో....
ప్రతిపౌరునికీ .... ఉండి తీరాలి నిజయతీ...!
అది పాలకు లైనా...
పాలితు లైనా...!
" పరస్పర సహకార...! "
చరణం :-
కర్తవ్య నిర్వహణ అందరి కొకటే...!
హక్కులు- బాధ్యతలూ అందరికీ సమానమే..!!
అధికారం కొమ్ములైతె పసువులె ఔతారు...!
ఆ అధికారం కోరలైతె జంతువులే ఔతారు..!! 2
"పరస్పర సహకార.... "
చరణం :-
i a s , నేనని... i p s నేనని... ముఖ్య మంత్రి నేనని , ప్రధాన మంత్రి నేనని.... 2
అహము జూపితే...,
ఆ అధికారాన్ని దు ర్విని యోగం చేస్తే...,
నిజమైన అధికారం ఎవరిదో, మా ఓటు తోనే మీకు చూపిస్తాము...!
మీ కు తగిన బుద్ది మేము చెప్ప గలము... 2
"పరస్పర సహకార.... "
******
మీ పాట - మీ నోట...! ప్రతి పౌ రునికీ ఉండి...! - కోరాడ నరసింహా రావు!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి