గణ తంత్ర దివస్....రి పబ్లిక్ డే...ప్రజల కొరకు,ప్రజల వలన, ప్రజలచేత , ప్రజలే పాలకులైన పండగ రోజు..!బలమున్న వాడు రాజు...తెలివున్న వాడు మంత్రి...నిజమే... ఇలా ఐతేనే రాజ్యం సుస్థిర మౌతుంది !అది వారి ఇష్టారాజ్యమైపో తుంది కదూ...!కదూ..ఏంటి,ఐపోతుంది!చరిత్ర చెప్పిన సాక్ష్యాలెన్నో ఉన్నాయిగా...!!అసలు రాజ్యం ఎవరి కొరకు...!?ప్రజల కొరకే గా...!అధికారం ప్రజల చేతుల్లోనే ఉండాలి...!అందుకే... ఎన్నో రాజ్యా లను, రాజ్యాంగాలనూ...పరిశీలించి , పరిశోధించిఎవరి కెలా ఐతే న్యాయం జరుగుతుందో మేధావులు తర్కించి...విధి,విధానాలనురూపొందించిపొందుపరచి...మిమ్మల్ని మీరు పాలించు కొండి అని మన కందించిన పవిత్ర గ్రంధముమన భారతీయరాజ్యాంగము..!మన రాజ్యాంగ పరిరక్షణలో ...మన మందరమూ భాగ స్వాములమే...!!రాజ్యాంగ పరిరక్షణయే... దేశ రక్షణ...!దేశ సరిహద్దుల్లో రక్షణ బాధ్యత సైనికులదైతే...అంతర్గత భద్రత... పౌరుల మైన మన ప్రతి ఒక్కరిదీ..!బాధ్యతలు విస్మరించిన వారికి హక్కుల నడిగె అధికార ముండదు...!రిపబ్లిక్ డే... అంటె...మైదానంలో విణ్యాసాలు,ఉపన్యాసాలు, జెండా వందనాలు మాత్రమే కాదు మిత్రులారా...బాధ్యతలను విస్మ రించ మని\\ప్రమా ప్రమానముచేసి, మాట తప్పక మసలుకోవటం..!జయహో రిపబ్లిక్ డే...!జయ జయ హో భారత్!!******
జయహో...జయ జయ హో...! :- కోరాడ నరసింహా రావు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి