న్యాయములు-761
"అంగులి దీపికయా ధ్వాంత ధ్వంసన విధి" న్యాయము
******
అంగులి అనగా వ్రేలు,బొటన వ్రేలు, ఏనుగు తొండము చివర.దీపిక అనగా చిన్న దీపము,చిన్న కాంతి,కాగడా,వెలుగు.ధ్వాంత అనగా చీకటి.ధ్వంసన అనగా పడుట,ముక్కలగుట, నాశము,వ్యయము.విధి అనగా బ్రహ్మ, భాగము, కాలము, ఆజ్ఞ, ధార్మిక కృత్యము అనే అర్థాలు ఉన్నాయి.
మినుకు మినుకు మను ఒక చిన్న దీపమును వ్రేళ్ళతో పట్టుకుని కారు చీకటిని పోగొట్టడానికి ప్రయత్నించినట్లు. స్వల్ప సాధనముచే మహత్కార్యము సాధింపబూనుకోవడమే ఈ న్యాయము లోని అంతరార్థము.
అనగా ఒక చిన్న ప్రయత్నమే పెద్ద కార్యానికి లేదా ఆశయానికి మూలము అవుతుందని అర్థము.
దీనికి సంబంధించి ఆధ్యాత్మిక గురువు అయిన మాతా ఆత్మానందమయి గారు చెప్పిన ఓ ఆసక్తికరమైన కథను చూద్దాం.
కొన్ని ఎత్తైన పర్వతాల నడుమ ఒక సుందరమైన లోయ వద్ద ఒకానొక చిన్న ప్రవాహం ఉండేది. దానికి మహా సముద్రాన్ని చేరాలని బాగా కోరిక ఉండేది.అలా చేరుకోవాలని కలలు కూడా కనేది.ఆ కోరిక తీర్చుకోవాలని చేసే ప్రయత్నంలో ప్రయాణించిన ప్రతిసారీ దారిలోని రాళ్ళు,రప్పలు, కొండలు, దట్టమైన అడవులు ఎదురవుతూ వుండేవి.అందులో కొన్ని ఆ చిట్టి ప్రవాహాన్ని "నువ్వు చాలా సన్నగా, బలహీనంగా వున్నావు. నువ్వు అంతదూరం ప్రయాణించలేవు"అని నిరుత్సాహ పరిచేవి.
దాంతో ఇక తాను ఎప్పటికీ మహా సముద్రము చేరుకోలేనేమో అని దిగులు పడిపోయింది. ఆ చిట్టి ప్రవాహపు దిగులును అక్కడే ఉన్న ఓ వృక్షమాత గమనించింది. ఆ చిట్టి ప్రవాహాన్ని పలకరిస్తూ "ఓ చిన్ని ప్రవాహమా! ఇలా బాధ పడటం వల్ల ఉపయోగం లేదు.మహా సముద్రాన్ని చేరాలనే తపనను శక్తిగా మార్చుకో. నీ సంకల్పాన్ని బలపరుచుకో.ఎన్ని అడ్డంకులు ఎదురైనా నీ చిన్ని ప్రయత్నాన్ని మానకుండా సాగిపో! అని కొండంత ధైర్యాన్నిచ్చి దీవించి పంపింది.
ఆ ధైర్యంతో మనసులో ఎలాంటి భయాలు, సంకోచాలు పెట్టుకోకుండా సాగిపోయింది. రాళ్ళూ రప్పలూ, సందులు గొందులు దాటుకుంటూ ముందుకు ప్రవహిస్తూ తాను అనుకున్న విధంగా చివరికి మహా సముద్రంలో లీనమై పోయింది.అలా వెళ్తూ వెళ్తూ మధ్యలో తన వంతుగా భూమాతను సస్యశ్యామలంగా మార్చింది.
అలా మన సంకల్పం వ్రేళ్ళ మధ్య ఇమిడిన చిన్న దీపం లాంటిదైనా,చిట్టి ప్రవాహం లాంటిదైనా ఒక మంచి కోసం సమాజ హితం కోసం అయినప్పుడు ప్రయత్నాలను ఆపకుండా, ఆటంకాలకు భయపడకుండా ప్రయాణాన్ని కొనసాగించడమే అనేది ఈ "అంగులి దీపికయా ధ్వాంత ధ్వంసన విధి న్యాయము" ద్వారా మనం తెలుసుకోగలిగాం.
మన పెద్దవాళ్ళు తరచూ అనేది కూడా ఇదే చిరు దీపం చాలు చీకట్లను తొలగించడానికి - చిరు ప్రయత్నం చాలు అనుకున్నది సాధించడానికి.అతి చిన్న మిణుగురు పురుగులాంటి ఆశయం మనలో ఉంటే అదే అఖండ దీపంలా మారి చుట్టూ ఉన్న అజ్ఞానపు చీకట్లను తొలగిస్తుంది.సూర్యునిలా ఆశయం తనకు తానే స్వయంప్రకాశమై వెలుగులను వెదజల్లుతుంది.
అదండీ విషయం! నేడు పర్యావరణం కాలుష్యంతో ప్రకృతి తల్లడిల్లి పోతోంది. మన పిల్లల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది.పంచభూతాలు కలుషితమై ప్రపంచాన్నే భయకంపితులను చేస్తున్నాయి. వీటన్నింటికీ కారణం మనమే.పరిష్కారమూ మన చేతుల్లోనే ఉంది.కాబట్టి మనమూ స్వల్ప సాధనముచేత మహాత్కార్యాన్ని సాధించేందుకు పూనుకుందాం.అందులో అజేయులమై నిలుద్దాం. నాతో ఏకీభవిస్తారు కదూ!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి