పావుల బిల్ల :- ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట
పందెం పుంజు వచ్చింది 
పావుల బిల్ల తెచ్చింది 
పాతర పెట్టి దాసింది 
దాసిన రేవు మరిచింది

పావుర మొచ్చి చూసింది
పెట్టిన చోటున వాలింది 
కాల్లతో అది తవ్వింది
పావుల బిళ్ళ తీసింది

పక్కకు పెట్టి ఆడింది 
పరుగున పాపా వచ్చింది
కిలకిలమని నవ్వింది 
పావురమెళ్ళి పోయింది 

పాప పైసలు తీసుకుని 
కొట్టు వద్దకు వెళ్ళింది 
చిలుకల పేరు కొన్నది 
గబగబా ఇంటికి వెళ్ళింది 


కామెంట్‌లు