చిత్ర స్పందన ..! :- కోరాడ నరసింహా రావు
మంత్రాక్షరాలను ఉచ్వసించి...! 
  అక్షర మంత్రాలను నిస్వ సిస్తున్నాడు...!! 

ఒక్కో మంత్ర వాక్యమూ... 
  ఒక్కో జీవన సాఫల్య తంత్రమై.... సమాజానికి మార్గ దర్శనం చెయ్యగలదు..! 

గతమును చదివి... 
  వర్తమాన స్థితిగతులను అవగాహన చేసుకుని... 
  తప్పొప్పులను సవరిస్తూ నవ సమాజ నిర్మానమునకై... 
  పరితపిస్తున్న ప్రజా    శ్రేయోభిలాషి... 
  నిజ సాహితీ వేత్తకుగాక ఎవరికుండునీ తపన..!? 
 స్పందించే మనసు.... 
  అందముగా , ఆకట్టు కు నేట్టు ప్రతిస్పందించ గల వారు సాహితీ వేత్తలు గాక 
 వే రె వ రు కాగలరు...?! 

 ఓ అక్షరకృషీవలా నీవు ద్ర ష్ఠవు...శ్రష్ఠవు ,నీజ్ఞాన దానముమిక్కిలి పవిత్రము... 
  నీ జన్మము ధన్యము..!! 
        *****

కామెంట్‌లు