న్యాయాలు-759
క్షీరాబ్ధి వాసి క్షీర కామ న్యాయము
****
క్షీర అనగా పాలు.అబ్ది అనగా సముద్రము. వాసి అనగా ఉండువాడు,వసించు వాడు. కామ అనగా కోరిక అనే అర్థాలు ఉన్నాయి.
క్షీరాబ్ధి వాసి అనగా పాల సముద్రములో నివసించు వాడు.క్షీర కామ అనగా పాలు కావాలని కోరుకోవడం.
"పాల సముద్రంలో నివసించే వాడు పాలకోసం వెతుక్కున్నట్లు"అని అర్థము.
దీనికి దగ్గరగా తెలుగులో ఉన్న సామెతలను చూద్దామా.."సముద్రం తలాపున ఉన్నా చేప దూపకేడ్చింది"అనే సామెత,అలాగే " తలంత బలగం ఉన్నా తలకు పోసే దిక్కు లేదు" అనే సామెత కూడా దాదాపుగా పై న్యాయముతో పోల్చే విధంగా ఉన్నాయి.
మరి ఈ పొడుపు కథలు చదువుతూ లోతుగా అధ్యయనం చేస్తే...మనసున్న ప్రతి ఒక్కరూ చలించక మానరు.మరెందుకో తెలుసుకుందాం.
ఇక్కడ పాల సముద్రము అనేది మానవ జీవితంతో అల్లుకున్న కుటుంబ బంధంగా చెప్పుకోవచ్చు. అవసరానికి ఏమాత్రం ఉపయోగపడకుండా, కష్టాల్లో ఆదుకోకుండా ఉండే బంధం ఉన్నా లేనట్లే.చూడటానికి సమూహంగా కనిపిస్తాడు కానీ మనిషి మాత్రం ఒంటరే.'అన్నీ వున్న అనాధే' అని అర్థము.
"సముద్రం తలాపున ఉన్నా చేప దూపకు ఏడ్వడం" అంటే అదే. ఇక్కడ చేపను మనిషికి ప్రతీకగా తీసుకోవడం జరిగింది. అది సముద్రంలో ఉన్నా దాహం కోసం ఏడ్వడం అంటే అది పెద్దదై పోయిందనీ, పెద్దదైన అంటే ఇక్కడ ముసలిదైన అని అర్థము.తాను స్వయంగా ఏ పనీ చేయలేక ఇతరులపై ఆధారపడి బతుకుతున్న వ్యక్తి అని అర్థము..
ఈ న్యాయం గురించి ఎప్పుడో మన పెద్దవాళ్ళు చెప్పారు.ఇంటినిండా ఎంతో బలగం ఉన్నా పెద్ద వయసు వచ్చిన వాళ్ళను కుటుంబంలోని సభ్యులెవ్వరూ పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసే కొన్ని కుటుంబాలను మన చుట్టూ ఉన్న సమాజంలో చూస్తూ ఉన్నాం. అందుకే చాలా మంది అనాధాశ్రమములోనూ, వృద్ధాశ్రమాలలోనూ గడుపుతున్నారు.
ఇక రెండోది కూడా అదే విషయాన్ని నొక్కి చెబుతోంది...."తలంత బలగం వుంది -తలకు పోసే దిక్కు లేదు" అంటే వృద్ధాప్యం వలన శరీరంలో మార్పులు వస్తాయి.చేతగాక,ఉడిగి పోయిన వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు స్వయంగా చేసుకోలేరు ఇతరులపై ఆధారపడాల్సి వస్తుంది. మరి ఓపిక ఉన్నంత కాలం వాళ్ళ శ్రమను పూర్తిగా వినియోగించుకున్న వాళ్ళే తర్వాత వాళ్ళను చూడటానికి వంతులు వేసుకోవడం లెక్కలు కట్టడం ఎంతో దారుణం కదా!
కడుపునిండా సంతానాన్ని కని వాళ్ళ అభివృద్ధి కోసం రెక్కలు ముక్కలు చేసుకుని పెంచిన సంతానానికి మరెందుకో కన్నతల్లి దండ్రులు బరువైపోతున్నారు. ఈరోజుల్లో వాళ్ళకు భోజనం పెట్టాలంటే లెక్క గట్టి డబ్బు వసూలు చేసుకునే వాళ్ళు ఉన్న సమాజమిది.అలాంటి సమాజంలో మార్పు వచ్చేందుకు, తెచ్చేందుకు మన వంతు ప్రయత్నాలు చేయాలి.
"క్షీరాబ్ధి వాసి క్షీర కామ న్యాయము 'ద్వారా మనం ఎన్నో విషయాలు తెలుసుకున్నాం.మనం మనుషులం. మానవీయ విలువలతో జీవించాల్సిన వాళ్ళం. అవి తెలుసుకుని మసలుకుందాం.క్షీరాబ్ది వాసుల్లాంటి వారికి పాలే కాదు మాటల అమృతం చేతల పరమాన్నం కూడా అందేలా చూద్దాం.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి