ఆటవెలది పద్యాలు
------------------------
మూడు వాగులందు ముచ్చటై కలయిక
సీతరామనడక సిరులు కురియ
మౌని తపసులందు మాండవ్య కవీంద్ర
కూడవెళ్ళినందు కోటిప్రభలు
స్పటికలింగమెట్టె సద్గుణ రాముడు
కాశిలింగ హనుమ కానుకవగ
రెండు లింగలిడుమ తోడు ప్రతిష్టలు
కూడవెళ్ళినందు కోటిప్రభలు
రామలింగ చరిత రాజిల్లు జగతిన
కూడినట్టి చోటు కూడవెళ్ళి
సకల జనుల బాట సద్గుణ పూజలు
కూడవెళ్ళినందు కోటిప్రభలు
మాఘమాసమందు మహినంత పరుగులు
జాతరందు కలువ జాగృతంబు
దండి వెలుగులందు దక్షిణకాశిగా
కూడవెళ్ళినందు కోటిప్రభలు
కులము మతములేదు కుడ్లేరు చెంతన
రామలింగసామి రక్షరక్ష
వరములిమ్ము తండ్రి వచ్చిన జనులకు
కూడవెళ్ళినందు కోటిప్రభలు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి