వాసు 9వ తరగతి చదువుతున్నాడు. హైస్కూలు చదువు మొదలైనప్పటి నుంచి, సమయం వృథా చేయించే అల్లరి స్నేహాలు ఎక్కువైనాయి. పాఠశాల నుంచి ఇంటికి రాగానే పుస్తకాలు ఇంట్లో వేసి, స్నేహితులతో ఆటలకు వెళ్ళేవాడు. రోజూ గంటల తరబడి క్రికెట్ ఆడి రాత్రి వచ్చేవాడు. సెలవు రోజుల్లో ఇంటి పట్టునే ఉండేవాడు కాదు.
వాసుకు శ్రావణి అనే చెల్లెలు ఉండేది. శ్రావణి 4వ తరగతి చదువుతున్నది. చిన్నప్పటి నుంచీ తెలివైన అమ్మాయి. క్లాస్ ఫస్ట్ వఛ్చేది. అన్నయ్యకు చెల్లెలు అంటే పంచ ప్రాణాలు. చెల్లెలు తరచూ అన్నయ్యకు నీతులు చెప్పేది. "అన్నయ్యా! ఇంటి పట్టునే ఉండి మంచిగా చదువుకో. అల్లరి సహవాసాలు చేస్తే చెడిపోతావు. చదువులో ఫస్ట్ వచ్చి, అమ్మా నాన్నలకు మంచి పేరు తీసుకుని రా!. ఇద్దరం కలసి చదువుకుందాం." అని. చెల్లెలి మాటలకు అలాగే అని తల ఊపేవాడు. మరునాడు షరా మామూలే. "
ఒకరోజు యథా ప్రకారం వాసు పుస్తకాలు ఇంట్లో పడేసి, ఆటలకు వెళ్ళాడు. మరునాటి నుంచి పరీక్షలు. శ్రావణి అన్నయ్యను వెతుక్కుంటూ వెళ్ళింది. ఒకచోట అల్లరి బృందంతో క్రికెట్ ఆడుతున్న అన్నయ్యను చూసింది. రంగ బౌలింగులో సోము కొట్టిన భారీ షాట్ ప్రమాదవశాత్తూ శ్రావణి తలకు తగిలి, గాయమైంది. వాసు శ్రావణిని ఆసుపత్రికి తీసుకుని వెళ్తున్నాడు. వాసు అల్లరి మిత్ర బృందం అంతా ఆటను ఆపి వెళ్తున్న వాసును వెంబడించి మరీ తిడుతున్నారు. చెల్లెలిని ఆసుపత్రిలో చేర్పించాడు. వాసుకు తన మిత్రులు అనుకున్న వారు తనకు శత్రువులు అని అర్థం అయింది. ఇంటి పట్టునే ఉండి, చెల్లెలితో కలసి చదువుకుంటూ మంచి విద్యార్థి అయినాడు వాసు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి