కొడుకు కోడలొచ్చారు
కోటలోకి చేరారు
కొడవలి చేతపట్టారు
కోతకు వారు వెళ్లారు
పొలము గట్టు చేరారు
పదిలంగా గడ్డి కోశారు
పొదల మాటన పెట్టారు
పొందుగా మోపు కట్టారు
నెత్తిమీదికి ఎత్తారు
నెలవంకను చూశారు
నెమ్మదిగా నడిచారు
ఇల్లు చేరవచ్చారు
గడ్డిమోపు విప్పారు
గేదలకేమో వేశారు
కడుపునిండా తిన్నాయి
కమ్మటి పాలనిచ్చాయి
కుండలో పాలు కాచారు
పిల్లలు పెద్దలు తాగారు
ఒంటిలో బలము వచ్చింది
పుష్టిగా వారు ఉన్నారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి