నీ అందాన్ని -
చూడడానికి,
నా రెండునయనాలు
చాలడంలేదు!
పాలరాతి బొమ్మలాఉన్న,
నీ అందం...
చూపరులకు సైతం,
మతి పోగొడుతుంది!
నీ ఆల్చిప్పల వంటి కన్నులు
నల్లని కలువపువ్వుల్లా
నన్నే పదేపదే వీక్షస్తున్నాయి!
నీ ఎర్రని పెదవులు
గులాబీ రేకులవలె
మృధువుగా గుబాళింపులు
వెదజల్లుతున్నాయి!
నీ చెక్కిళ్ళు
బిడియంతో ఎరుపెక్కాయి.
నీ కొరకొర చూపులు
నా గుండెను పిండేస్తున్నాయి!
నీ నల్లని కురులు
అమావాస్య చీకటివలె
నన్ను భయ బ్రాంతులకు
గురిచేస్తున్నాయి!
నీ అందం -
నిండుపున్నమినాటి
వెన్నెలలాగ
నలుమూలలా
వెలుతురును ప్రకాశిస్తున్నది!!
***
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి