ఎందుకో?:- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
కలము
పట్టాలని ఉన్నది
పుటలు
నింపాలని ఉన్నది

పదాలు
పేర్చాలని ఉన్నది
పెదాలు
కదిలించాలని ఉన్నది

పలుకులు
విసరాలని ఉన్నది
తేనెచుక్కలు
చిందాలని ఉన్నది

ముచ్చట్లు
చెప్పాలని ఉన్నది
చప్పట్లు
కొట్టించాలని ఉన్నది

మోములు
వెలిగించాలని ఉన్నది
మనసులు
దోచుకోవాలని ఉన్నది

అందాలు
వర్ణించాలని ఉన్నది
ఆనందము
కలిగించాలని ఉన్నది

మాధుర్యాలు
అందించాలని ఉన్నది
కమ్మనివంటలు
వడ్డించాలని ఉన్నది

చాతుర్యము
చాటాలని ఉన్నది
చమక్కులు
చూపించాలని ఉన్నది

తలపులు
పారించాలని ఉన్నది
భావాలు
బహిరంగపరచాలని ఉన్నది

భారతిని
ప్రార్ధించాలని ఉన్నది
సాహితిని
సమృద్ధిచేయాలని ఉన్నది


కామెంట్‌లు