ప్రముఖుల మధ్య 'మగువ' పుస్తక ఆవిష్కరణ..!!

 ముప్కాల్ మండల కేంద్రంలో బుధవారం  ఉదయం 'మగువ' పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జీఎన్ఆర్ గార్డెన్ లో ఏర్పాటు చేశారు. ఇట్టి కార్యక్రమంను స్థానిక గ్రామాభివృద్ధి కమిటీ, లయన్స్ క్లబ్ సభ్యులు సంయుక్తంగా కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు సిద్ద రమేష్ మాట్లాడుతూ ముప్కాల్ పోలీసు స్టేషన్ లో ఏఎస్సై గా విధులు నిర్వర్తిస్తున్న ప్రముఖ కవి,రచయిత అయిన తొగర్ల సురేష్ రచించిన 'మగువ' పుస్తకంను ప్రముఖుల సమక్షంలో ఆవిష్కరించడం జరిగిందని అన్నారు. కార్యక్రమంలో భాగంగా పలువురు ప్రముఖులు తొగర్ల సురేష్ ను ఘనంగా సన్మానించారు. ఎస్సై వి.రజినీకాంత్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది సైతం సురేష్ ను అభినందిస్తూ సత్కరించారు. కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, లయన్స్ క్లబ్ సభ్యులు, పుస్తక ప్రియులు, రాజకీయ నాయకులు, ప్రముఖులు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..
కామెంట్‌లు