తెలుసుకుందాం! అచ్యుతుని రాజ్యశ్రీ

 రఘువీరగద్యం కి ఇంకోపేరు మహావీరవైభవం. శ్రీవేదాంతదేశికులవారిచే రాయబడింది.ఈరచనకో కారణం ఉంది.డిండిమభట్టు అనే పండితుడు ఈయనకు సవాలు విసిరాడు."నాకంచుఢక్కను మీరు మోగిస్తూ ఉంటే దానికనుగుణంగా నేను కవితలల్లుతాను."దేశికులవారు వివిధ తాళాల గతులు జతులతో వాయించేప్పటికి డిండిమభట్టు ఓడిపోయాడు. ఆయన ఢక్క వాయిస్తే దేశికులవారు  ఆవాయిద్యానికి అనుగుణంగా ఈరఘువీరగద్యంను ఆశువుగా చెప్పి మెప్పించారు. రామాయణంలోని ఏడుకాండల్లోని ముఖ్య ఘట్టాలు లయ భక్తితో శ్రోతలకు వీనులవిందు చేస్తాయి.పక్షులు జంతువులను పట్టి బంధించటం అమానుషం.కథలు పురాణాల్లో చెప్పారు.జానపద గాథల్లో వివరణలుకూడా ఉన్నాయి.సీతమ్మ చెలికత్తెల్తో వనవిహారం చేస్తూ చిలుకదంపతుల మాటలువిని వాటిని అంతఃపురంలోకి తెప్పిస్తుంది.ఆడచిలుక గర్భవతి అని తన దగ్గరే ఉంచుకుని మగచిలుకను విడిచిపెట్టింది. ఆడచిలుక పతి ఎడబాటు కి వగచి " నీవుకూడా గర్భవతిగా ఉన్నప్పుడు భర్తను విడిచి దూరంగా ఉంటావు. " అని శపించి చనిపోయినది.అందుకే రాముడు సీతమ్మను గర్భవతిని లోకనింద కు వెరచి అడవిలో దింపిరమ్మని లక్ష్మణునితో పంపాడు.నేపాల్లో ముక్తినాథ్ క్షేత్రంలో గండకీనదిలో సాలగ్రామాలు దొరుకుతాయి. స్వర్ణభ్రమరాలనే కీటకాలు ఈశాలగ్రామశిలల్ని తొలిచి అందులో కొన్నాళ్లుండి వేసవిలో ఎగిరిపోతాయి .విష్ణుస్వరూపమే సాలగ్రామం అని శ్రీమూర్తి అనికూడా పిలుస్తారు.శ్రీ పురుషసూక్తాలతో అభిషేకం చేయాలి🌷
కామెంట్‌లు