ఆత్మకూర్ మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన తెలుగు రాఘవేంద్ర ఆదివారం రోజున బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్,,హైదరాబాదులో ప్రముఖుల చేతుల మీదుగా పండుగ సాయన్న రాష్ట్రస్థాయి సేవా పురస్కారాన్ని అందుకోవడం జరిగినది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ శాసనమండలి సభ్యులు ప్రొఫెసర్ కోదండరాం మరియు శివ ముదిరాజ్, డా.హేమలత, రాములు, జనార్దన్, పాండు తదితరులు పాల్గొన్నారు.పండుగ సాయన్న ఆనాటి నిరంకుశ నిజాం అధికారాలను,అధికారులను ప్రశ్నించి, వారిని ఎదిరించి బహుజన రాజ్యాన్ని స్థాపించడానికి ప్రయత్నం చేశాడు అని అతిథులు, నిర్వహకులు తెలియజేశారు
తెలంగాణ రాబిన్ హుడ్,ప్రజా వీరుడు,బహుజన గొంతుక పండుగ సాయన్న రాష్ట్రస్థాయి సేవా పురస్కారంకు నన్ను ఎంపికచేసిన నిర్వాహకులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అని తెలుగు రాఘవేంద్ర తెలియజేశారు.
ఈ సందర్భంగా తెలుగు రాఘవేంద్రకు పలువురు గ్రామ, మండల నాయకులు,పెద్దలు,స్నేహితులు అభినందనలు తెలియచేశారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి