అమ్మ కొంగు కప్పుకుని
దోబూచులాడే పాపాయిలా
హాయిగా నవ్వుతూ చూస్తూ
రేయి కమ్మిన చీకటిని తరిమేస్తూ..
పెంకెతనం చేసే పిల్లాడిలా
అడ్డుతప్పుకోని పోగమంచును
కిరణాల కర్రలతో బెదిరిస్తూ
వెచ్చని వాతలతో చెదరగొడుతూ..
తెరిచి తెరవని కన్నులతో
అరవిరిసిన అరవిందాలు
తెర తీసే దాకా ఆగక
త్వరపడుతున్నది గమనిస్తూ
ఇలనంతా దాచేస్తూ
కలలాగా కమ్మేస్తూ
వలలో వసుధను దాచిన
చలి పులిని అదిలిస్తూ...
అంబరానికి రంగులు అద్ది
దిక్కులకు వెలుతురు నింపి
సంబరముగ పుడమిని
వెలుగుల వాకలు కురిపింప
వచ్చే వెలుగుల వేలుపుకు
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి