తెలుసుకుందాం!:- సేకరణ..అచ్యుతుని రాజ్యశ్రీ

 బెజవాడ కనకదుర్గమ్మ జగన్మాత.ఆమె కొండపై వెలిసింది.కీలుడనే యక్షుడి కోరిక పై అతను కొండగా మారాక వెలిసింది.మహిషాసురమర్దని రూపంలో వెలిసింది.ఇంద్రాద్రి దేవతలు పూజించుటవల్ల ఇంద్రకీలాద్రి గా పిల్వబడ్తోంది.ఆదిశంకరాచార్యులు మల్లేశ్వరశివలింగాన్ని పునఃప్రతిష్ఠ చేశారు.అర్జునుడు ఇక్కడ తపస్సుచేసి పాశుపతాన్ని పొందాడు.సగరచక్రవర్తిని గూర్చితెలుసుకుందాం.సత్య హరిశ్చంద్రుని గూర్చి మనకు తెల్సు.అతని కుమారుడు లోహితుడు. ఇలా అతని వంశంలో చాలామంది తర్వాత బాహుసేనుడు పాలకుడైనాడు. పట్టపురాణి గర్భవతిగా ఉండగానే అతను చనిపోయాడు.రాణి సవతి పోరు పడలేక  ఔర్వముని ఆశ్రమంలో ఉంది.సవతి విషప్రయోగం చేసినా రాణి బ్రతికి బట్ట కట్టి ఓకొడుకుని కన్నది.విషంతో పుట్టిన ఆశిశువే సగరచక్రవర్తి.ఈయనకు ఇద్దరు భార్యలు.పెద్ద భార్య కొడుకు అసమంజసుడు. వాడు రెండోభార్య 60వేలమంది పిల్లల్ని ఏడ్పించేవాడు. గంగలో ముంచేవాడు. అందుకే రాజు వాడిని దేశంనుంచి వెళ్లగొట్టాడు. ఈసగరపుత్రుల్ని కపిల మహర్షి బూడిద గా మారిస్తే భగీరథుడు గంగను రప్పించి వారికి ఉత్తమ లోకప్రాప్తి కల్గజేశాడు. ఇదే భగీరథ ప్రయత్నం.మనంకూడా అలా పట్టుదలగా కార్యాలు పూర్తిచేయాలి. 🌷
కామెంట్‌లు