21.
నీలి మబ్బుల యందు జూసితి నిక్కు దేహపు సౌరులన్
మేలి పద్మములందు జూసితి మీఱు కన్నుల కాంతులన్
వాలు కొండలయందు గాంచితి వాఁడి గుండెల బింకమున్
మేలుబంతివి వీర రాఘవ, మేలుకో ధరనేలుకో!
నిఘంటువు:
నిక్కు= విజృంభించు
మీఱు= అతిశయించు
వాఁడి=కాఠిన్యమైన
బింకము=ధైర్యము
మేలుబంతి=శ్రేష్ఠము
22.
మూడు నేడుల గోపురాలట ముచ్చటౌ తమ రంగమున్
వాడవాడల మోగుచున్నది వాచ్యమై తమ నామమే
యేడు గోడల నట్టియింటను హీర తల్పపు శాయివై
మేడు తేర్చగ రంగనాయక! మేలుకో ధరనేలుకో!
==================================
నిఘంటువు:
మూడునేడులు=ఇరవై ఒకటి
వాచ్యము= చెప్పతగినది/వర్ణించతగినది
హీరతల్పము=శేషతల్పము/వజ్రపుమంచము
శాయి= పడుకొన్నవాడు
మేడు=అజ్ఞానం/మోసం
తేర్చు=పోగొట్టు
=============================
డాక్టర్ అడిగొప్పుల సదయ్య
వ్యవస్థాపక అధ్యక్షుడు
మహతీ సాహితీ కవిసంగమం
కరీంనగరం
9963991125
మేలుకొలుపులు(మత్తకోకిల)-డాక్టర్ అడిగొప్పుల సదయ్య
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి