ఐదేళ్లు...
మనమనుభవించు...
అవి కష్టములైన-సుఖములైన..
వాటికి... బాధ్యులము మనమే పౌరులారా...!
అదిమన స్వయంకృతము
విచక్షణ లేని ఓటరులమై
మనకులమనో, మన వర్గమనో....మనవాడనో!
బిర్యాని పెట్టాడనో , మందు పోసాడనో , డబ్బులిచ్చా డనో...
కురిపించిన ప్రేమకో...
వంకదండాలకొ , కల్ల బొల్లి కబుర్లకో ,మాటలగారడీకొ ....
ఓటుతో నీ బతుకును తాకట్టు పెడితే...
అది కేవలం ఐదేళ్లతో పోయేది కాదు...!
ఆ వెతలు , ఆ కతలు ఓ జీవిత కాలాని కైనా తొలగక పో వచ్చు....!!
మన ఉదాశీనతో, బలహీ నతో....అవివేకమో...మనభవిష్యత్తును బలి చేస్తే...
పిదప బాధపడి ప్రయో జన మేమి...!?
ఓటేసే ముందే... బాగా ఆలోచించండి...!
ఆవేశపూరిత ఉపన్యాసాలు... నేను, నేనే నను అహంకా రాలు...
ప్రదర్సించే వారు ఏదో సాధించే స్తారనుకుంటే పొరపడి నట్టే...!
అనుభవఙ్ఞాలెప్పుడూ అలా తొందర పడరు...!
ఓటరులమైన మనం...
చేసిన తప్పునే, మళ్లీ - మళ్లీ చేస్తున్నాము...
పశ్చాత్తాపము,పశ్చాత్తాపమే... తప్పులు-తప్పులే!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి