అందం
అగుపించితే
అక్షరాలలో
పెట్టాలనిపిస్తుంది
ప్రకృతి
పరవశపరిస్తే
పదాలలో
పొసగాలనిపిస్తుంది
పువ్వులు
పరిమళాలుచల్లుతుంటే
పుటలపైన
పొందుపరచాలనిపిస్తుంది
పెదాలు
తీపినిచవిచూపిస్తుంటే
తెలుగుతల్లిని
స్తుతించాలనిపిస్తుంది
మంచిమాటలు
మురిపిస్తే
కాగితంపై
కవితనుకూర్చాలనిపిస్తుంది
పున్నమిజాబిలి
పలుకరిస్తుంటే
ప్రణయగీతంవ్రాసి
పాడాలనిపిస్తుంది
ప్రశంసలవర్షం
తడుపుతుంటే
ఆనందగీతం
ఆలపించాలనిపిస్తుంది
కన్నీటిగాధలు
వింటుంటే
విషాదకైతలు
విరచించాలనిపిస్తుంది
బీదలపాట్లు
కంటుంటే
సాయంచేయాలని
సామ్యవాదంరాతలలో
మహానుభావులు
తలపుకొస్తే
గళమెత్తి
కీర్తించాలనిపిస్తుంది
దురలవాటేమో
మనసాగటంలేదు
కలమాగటంలేదు
కవితలాగటంలేదు
ఏమిచేయను
ఎట్లాగుందును
ఎవరితోచెప్పను
ఎలానడుచుకొందును?
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి