పుస్తకాల విలువ :- బి. నందిని-ఏడవ తరగతి-వల్లాల ఆదర్శ పాఠశాల
 అనగనగా ఒక ఊరిలో బిట్టు అనే ఒక పిల్లవాడు ఉండేవాడు,ఆ పిల్లవాడు తరచూ పుస్తకాలను చించేవాడు,ఆ పిల్లవాడి అమ్మానాన్న పుస్తకాలను చించకూడదు అని ఎంత చెప్పిన వినేవాడు కాదు,ఒకరోజు పిల్లవాడు నిద్రపోతుండగా తనకు ఒక కల వచ్చింది,ఆ కలలో ఒక పుస్తకం  నన్ను నువ్వు చించుతున్నావు కదా నీకు చదువు రాదు,నువ్వు అనుకున్న పోలీస్ జాబ్ కూడా నీకు రాదు అని అన్నది,బిట్టుకి మెలకువ వచ్చింది,వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్లి అమ్మానాన్న, నేను ఇప్పటినుండి పుస్తకాలు చింపను అని మాట ఇచ్చాడు బిట్టు,దాంతోవాళ్ళ అమ్మ నాన్నకి చాలా సంతోషం అనిపించింది.

 కథ నీతి పుస్తకాలను మనం చించకూడదు, ఇతరులని,చింపనీయకూడదు

కామెంట్‌లు