దిశ మార్చిన సూర్యునితో వచ్చింది సంక్రాంతిదశ తిరుగగ తెస్తుంది కాంతిజీవితానికి కొత్త భాతి!!పట్నమే పల్లెకు తరలి వచ్చిందిమెచ్చింది మెచ్చింది ఊరు వాడవెల్లివిరిసింది ఇంటింటా భాతితనువంతా పులకించగాపల్లెతల్లి!!(దశ..)ప్రతిఇంటి ముందు రంగవల్లుల పంటచూచువారికి నిండుగ ఆనందాలు కంటసంతసించినట్టి గడపలు పచ్చని తోరణాలు గట్టగొబ్బెమ్మల అలంకరణతో పుడమి పులకింతపిల్ల పెద్దలకు పర్వపు సంబరాల గుట్టభోజమంటలలో పాట ఆలోచనలు కాలునంతఆనందాల విరుల తోట!!పతంగులాటల జోరు ఒకవైపుకోడి పుంజులతో పందాల హోరుహరిదాసు కీర్తనలుగంగిరెద్దులతో విన్యాసాలురుచికరమైన పిండి వంటలుభోగి పండ్లతో చిన్నారులకు వేడుకలు .(వచ్చింది...)కొత్త ధాన్యరాశి నిండగ నవ్వినట్టి పుడమి తల్లిసంతోషాలు పంచిన సంక్రాంతిభోగితో మొదలు కనుమతో వీడ్కోలుఉత్తరాయణ పుణ్యకాలంగోదాదేవి కల్యాణంమూడు రోజుల ముచ్చటైన పండుగతో మురిసిన జాతి!!-------------
వచ్చింది సంక్రాంతి:-డా.చీదెళ్ళ సీతాలక్ష్మి-విశ్రాంత సహాయాచార్యులు-హైదరాబాద్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి