రామవరం ఉన్నత పాఠశాలలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పాటల పోటీ మొదలైంది. 6వ తరగతి చదువుతున్న గీతాంజలి అనే అమ్మాయి చాలా చక్కగా, శ్రావ్యంగా పాటలు పాడుతుంది. మంత్ర ముగ్ధలై వింటున్నారు. అప్పటి నుంచి ఆ పాఠశాలలో గీతాంజలి ఆ పాఠశాలలో అత్యుత్తమ గాయనిగా పేరు తెచ్చుకుంది.
ఒకసారి జిల్లా స్థాయిలో పాటల పోటీ జరుగుతుంది. గీతాంజలి ఆ పాటల పోటీలో పాల్గొన్నది. పోటీ మొదలైంది. ఒక్కొక్కరు పాటలు పాడుతూ ఉన్నారు. గీతాంజలి కూడా పాడింది. గీతాంజలి పాడిన తర్వాత చాలా సేపు చప్పట్లు కొట్టారు. అందరి కంటే గీతాంజలి గానానికి శ్రోతల స్పందన చాలా బాగా వచ్చింది.
బహుమతిలు ప్రకటించారు. గీతాంజలికి ఫస్ట్, సెకండ్ కాదు కదా, కనీసం ప్రోత్సాహక బహుమతి కూడా ప్రకటించలేదు. ఆ తర్వాత గీతాంజలిని కలసిన తల్లిదండ్రులు, గురువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అడిగారు "బాగా నిరాశ పడ్డావా?" అని. అప్పుడు గీతాంజలి ఇలా అన్నది. నా పాటకు శ్రోతల నుంచి బాగా చప్పట్లు వచ్చాయి. చాలామంది నన్ను కలసి బాగా మెచ్చుకున్నారు. ఇంతకంటే విలువైన బహుమతి ఇంకా ఏముంటుంది?" అని. వయసు చిన్నది అయినా గొప్పగా ఆలోచించిన గీతాంజలిని చూసి ఆశ్చర్యపోయారు.
బహుమతి : సరికొండ శ్రీనివాసరాజు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి