కవన రవళీ(సత్యవాక్కు);- కోరాడ నరసింహా రావు!
* నిత్య మే... సత్యం ..! *
        *****
అను నిత్యం అబద్దాల తో 
  కాలక్షేపం చేసే మనిషి కి
   సత్యం విలువ తెలియక పోవచ్చు ..! 
  
నూరు అశ్వమేధ యాగాలు చేస్తే వచ్చే ఫలం 
 ఒక్క సత్య వాక్యాని కుంటుందన్న సంగతికి 
   మనకు చరిత్రలో ఎన్నో సంఘటనలురుజువు చేస్తున్నాయి ! 

ఇందుకు మనకో నిఖార్షయిన ఉదాహరణ హరిశ్చంద్ర ! 
   ఆతని సత్య వాక్పరిపా లనే  ...  అతనిని సత్య హరిశ్చంద్రగా చరిత్రలో నిలిపింది..!! 

మనకు సుమతీ శతక కర్త బద్దెన కూడా... 
  మాటకు ప్రాణము సత్యము అని ఖచ్ఛితంగా నొక్కి వక్కాణించాడు..! 

"సత్యమేవ జయతే.." 
 సత్యమే జయిస్తుంది ఇది అనాది వాక్యం...! 

మన స్వా తంత్ర్య మునకు 
మూల కారకుడని చెప్పుకు  నే గాంధీ అస్త్రాలుకూడా... 
 సత్యము, అహింశలే...! 

"సత్యం వద - ధర్మం చర " అంటూ..సత్యమునే మా ట్లా మొదట సత్యానికే పెద్ద పీట వేశారు మన వారు...! 

 సత్యము యొక్క ప్రయోజనము శాస్వతము
  అసత్యము తాత్కాలిక ప్రయోజనాన్ని చేకూర్చినా
 దాని చెడు ఫలిత ప్రభావం 
 ఆ బదిలి తీరినంతవరకూ
 వెంటాడుతునే ఉంటుంది! 

సత్యానిది ప్రశాంతత...! 
 అసత్యానిది ఆందోళన, 
 ఆలజడి... ఆనారోగ్యం ! 

ఒక అబద్దం, వంద అబద్దాల నాడిస్తుంది! 
 సత్యమెప్పుడూ  నిబ్బరమూ, నిశ్చలమే!! 
 పదే- పదే అబద్దాలు చెప్పే వారు ప్రాణాపాయస్థితిలో నైనా  సత్యము చెప్పి, ఎంత తలమొత్తుకున్నా... 
 ఎవరూ నమ్మరు..! 
   నాయనోయ్ పులి వచ్చె కధ లోలా...! 

సత్యమెపుడూ వెల్ల గొడు గే..! 
 అసత్య మెప్పటి కైనా... 
 అగ్గి పిడుగే....!! 
 తస్మాత్ జాగ్రత. ..! 
        ******

కామెంట్‌లు