జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత, కడుము పాతపొన్నుటూరు పాఠశాలలో సాంఘిక శాస్త్రోపాధ్యాయునిగా పనిచేస్తున్న కుదమ తిరుమలరావుకు శ్రీకాకుళంలో తెలుగు రచయితల వేదిక ఆధ్వర్యంలో ఆదివారం ఘన సన్మానం జరిగింది. రెండు దశాబ్దాల క్రితం స్థాపించిన తెలుగు రచయితల వేదిక నేడు నూరవ నెల సాహితీ ప్రస్థానానికి చేరుకున్న సందర్భంగా జరిగిన ఈ సభలో తిరుమలరావును సన్మానించారు.
డా.బి.ఆర్.అంబేద్కర్ యూనివర్సిటి వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కె.ఆర్.రజని, విశ్రాంత జిల్లా విద్యాశాఖాధికారి బలివాడ మల్లేశ్వరరావు, తెరవే అధ్యక్షులు ఉత్తరావల్లి నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి రఘుపాత్రుని వెంకటరమణమూర్తి తదితరులు తిరుమలరావును శాలువా, జ్ఞాపిక, ప్రశంసాపత్రాలతో ఘనంగా సన్మానించారు. వీరితో పాటు సెట్ శ్రీ విశ్రాంత సి.ఇ.ఓ, ఇంటలెక్ట్యువల్ ఫోరం జిల్లా ఛైర్మన్ సురంగి మోహనరావు, జిల్లా రెడ్ క్రాస్ ఛైర్మన్ పి.జగన్మోహనరావు, అంబేద్కర్ వర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ గుంటా లీలావరప్రసాదరావు, సంస్థ వ్యవస్థాపకులు కోనే శ్రీధర్, వాండ్రంగి కొండలరావు తదితరులు తిరుమలరావు సేవలను కొనియాడుతూ ప్రసంగించారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి