చిత్ర స్పందన : ఉండ్రాళ్ళ రాజేశం
 ఆటవెలది
సైకిలెక్కినంత సడలని ధైర్యాన
మోపు నెత్తినున్న ముందు కదులు
తాత పట్టుదలయె తరతరాల చరిత
పనులు చేయ కదులు తనయులార


మత్తకోకిల

సైకిలెక్కిన తాత దారుల సాగు నెత్తిన మోపుతో
తొక్కుతూ పరుగైన వింతల తోవ కన్నుల నిల్వగా
సక్కనైనను పైడినొక్కిన జారకుండను మూటనూ
పక్కకూ పడనీక నిల్చియు బాటలందున వీరుడై
 
కామెంట్‌లు