పూర్వీకులు ప్రజా క్షేమానికై కొన్ని ఆచారాలు, సాంప్రదాయాలు, పండుగలు ఏర్పరిచారు. కానీ కాలప్రవాహంలో పెద్దల ఉద్దేశ్యం మరుగున పడి ఆడంబరాలతో,అర్థంలేని విధంగా సనాతన ధర్మాలు రూపుదిద్దుకున్నాయి.
అలాంటి వాటిని చక్కదిద్దడం కొరకు
అవతార పురుషులు పుడుతుంటారు.
అలాంటి వారిలో భక్త కబీర్ ఒకరు.
*
కొన్నికథలు,సంఘటనలు,
మనల్ని ఆలోచింప చేస్తాయి. ప్రజల ఆలోచనలు సరిదిద్దె
ప్రయత్నానీచేస్తాయి. అలాంటిదే భక్త కబీర్, గురువును ప్రశ్నించిన
సంఘటన.
🦜
కబీర్ గూర్చి చాలా కథలున్నాయి.
అందులో ఒక కథ,
నీరూ,,నీమా అనే వారుముస్లింలు.వారు కబీర్ ను సాక్కున్నారని , ఆ పిల్లాడికి పేరు పెట్టాలంటే మత గురువులకు అన్ని భగవంతుని పేర్లే వచ్చాయని, అప్పుడు ఆ దంపతులు ఇతర మత గురువులను కూడా అడిగితే అలాగే దేవుని పేర్లు వచ్చాయని పిల్లవాని వల్ల మతాచారాలు దెబ్బతింతాయని గురువులుఆ పిల్లవాణ్ణి చంపేయమన్నారని ఒక కథ.
*
మరో కథ
కబీర్ ను సాకిన వాళ్ళు మహమ్మదీయులు. కానీ కబీర్ రామ నామాన్ని జపించేవాడు. హిందువులలాగా గంధం పూసుకోవడం, తులసి మాల ధరించడం ఇవన్నీ మహమ్మదీయులకు కోపం తెప్పించేవి. అలాగే మహమ్మదీయుడుగా ఉండి హిందూ మతాచారాన్ని ఆచరించటం హిందువులకు కోపంగా ఉండేది
హిందూ మత ప్రకారం ముక్తి పొందడానికి గురూపదేశం కావాలి.
కబీర్ తన గురువు
రామానంద స్వామి అని చెప్పుకున్నాడు.
ఇది ఎలా సాధ్యమైందో
దీనిని గూర్చి ఒక కథ.
🦜
రామానందుల వారు గంగా నదికి స్నానానికి వెళ్లేటప్పుడుప్ రామనామం జపిస్తూ వెళ్లేవాడు. అప్పుడు కబీర్ ఆయన వెళ్లే దారిలో కాచుకొని
ఆయన జపించిన రామ నామాన్ని వినడమే గురూపదేశంగా గ్రహించాడు.
అలాగే మరో కథ, రామానందుల వారిని చీకట్లో కబీర్ తాకాడట. గురువుగారు అలవాటు ప్రకారం" రామ" అన్నాడు. అదే కబీరుకు గురూపదేశమైంది.
మొత్తం మీద కబిరుకు రామానందులవారు గురువయ్యారు.
కబీరు చెప్పినఒక మంచి ఉదాహరణ.
*******
ఒకరోజు రామానందుల వారు
పితృదేవతలకు పెట్టడానికి పాలు కావలసి వచ్చింది. ఆ పాలు తెమ్మని కబీర్ ని స్వామి పంపించాడు కానీ ఎంతసేపటికి కబీర్ రాలేదు అప్పుడు మిగతా శిష్యులు వెళ్లి చూశారు. కబీర్, అప్పుడే చనిపోయిన ఒక ఆవుముందు గడ్డి వేసి, పాల పాత్ర దాని పొదుగు దగ్గర పెట్టుకుని కూర్చొని ఉన్నాడు.
ఈ విషయం శిష్యులు వచ్చి రామానందల వారికి చెప్పారు.
అప్పుడు రామానందులవారు కబీర్ ను పిలిపించి "చనిపోయిన ఆవు ఎక్కడైనా గడ్డి తింటుందా?పాలిస్తుందా?"అని ప్రశ్నించాడు.దానికి సమాధానంగా
కబీర్ ఇలా అన్నాడు.
"స్వామి! ఇప్పుడే చనిపోయిన ఆవు పాలు ఇవ్వనప్పుడు, ఎప్పుడో చనిపోయిన మీ పితృదేవతలు వచ్చి ఆ పాలను ఎలా త్రాగుతారు నాకు సెలవివ్వండి!" అని కబీర్ సమాధానం చెప్పాడు. ఇది ఆలోచించాల్సిన విషయమే.
ఏదైనా ఒక విషయం వాదనతో చెప్పే బదులు ఉదాహరణ పూర్వకంగా చెప్పడం మంచిదని కబీరు అలా చేసాడు.
కబీర్ సిద్ధాంతం
*****
మతం, ఉత్తమ జీవన విధానానికి సోపానం.
భగవంతుడు ఉన్నాడనీ ఆయన మీద పూర్తి విశ్వాసం ఉంచితే ఆయన నీ సర్వస్వం చూసుకుంటాడు. ఇది అసలు మతో దేశ్యం.కానీ కొందరు స్వార్ధపరులు మతాన్ని అర్థం లేని ఆచారాలతో కలుషితం చేశారు.
అన్నది కబీర్ సిద్ధాంతం
నీ బాధ్యతలు నీవు నిర్వహించు. నీ బాధ్యత భగవంతుడు చూచుకుంటాడు అంటాడు. కబీర్.
విశ్వకవి రవీంద్రుడు. చెప్పింది కూడా ఇదే. "వర్క్ ఇస్ గాడ్.
నీ పని నీవు నిష్కల్మషంగా, కపట రహితంగా చేస్తే భగవంతుడు నీ పక్కనే కూర్చొని ఉంటాడు.. ఇక దేవాలయానికి పోవడం దేనికి?" అంటాడు రవీంద్రుడు అవును దేవుడే మన దగ్గరికి వస్తున్నప్పుడు, మనం, మన కర్తవ్యాలను సక్రమంగా నిర్వహిస్తే స్వకార్యం, స్వామికార్యం రెండు సమకూరుతాయి.
గదా. "భక్తులపాలి పంజరపు చిలుక"అని త్యాగయ్య మాట
అర్థం చేసుకుంటే ,
కబీరు, త్యాగయ్య లాంటి వారి మాటలను ఆచరణలో పెడితే, మన జీవితాలు ఎన్నో సమస్యల నుండి బయట పడతాయి.
🌱🌿🌱🌿🌱
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి