-ఊషన్నపల్లికి ఉత్తమ పాఠశాల అవార్డు
-ఉపాధ్యాయుల పనితీరు, ఎఫ్ఎల్ఎన్ ఫలితాల ఆధారంగా ఎంపిక
-కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు పత్రం అందజేత
కాల్వశ్రీరాంపూర్ మండలం ఊషన్నపల్లి ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు బెస్ట్ స్కూల్ అవార్డు లభించింది. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య, ఉపాధ్యాయుడు అమృత సురేష్ కుమార్ జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు పత్రాన్ని అందుకున్నారు. పాఠశాలలో పిల్లల సంఖ్యను పెంచడం, దాన్ని అద్భుతంగా తయారు చేయడమే కాకుండా ఫౌండేషనల్ లిటరసీ న్యూమరసీ (ఎఫ్ఎల్ఎన్) కార్యక్రమాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈర్ల సమ్మయ్య, ఉపాధ్యాయుడు అమృత సురేష్ కుమార్ లు పగడ్బందీగా అమలు చేస్తున్నారు. తెలుగు, ఇంగ్లీష్, గణిత సామర్థ్యాల్లో పాఠశాల పిల్లల్ని అగ్రగామిగా నిలుపుతున్నారు. ఇటీవల రెండు పర్యాయాలు జిల్లా రిసోర్స్ గ్రూప్ సభ్యులు పాఠశాలను సందర్శించి, సంబంధిత సబ్జెక్టుల్లోని సామర్థ్యాలను పరీక్షించారు. నిర్దేశించిన సామర్థ్యల్లో పిల్లలు ప్రతిభ కనబరచడంతో వారు సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని వారు జిల్లా విద్యాశాఖాధికారి, జిల్లా కలెక్టర్ కు నివేదిక ఇవ్వడంతో ఊషన్నపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను బెస్ట్ స్కూల్ అవార్డుకు ఎంపిక చేశారు. ఇటీవల మహారాష్ట్రలోని లక్నోకు చెందిన దేవి స్వచ్ఛంద సంస్థ పెడగాజి విభాగం సభ్యులు ఊషన్నపల్లి పాఠశాలను సందర్శించి ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమం అమలు తీరును పరిశీలించి, పిల్లలు ఉపాధ్యాయులను అభినందించారు. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈర్ల సమ్మయ్య, ఉపాధ్యాయుడు అమృత సురేష్ కుమార్ లు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు పత్రాన్ని అందుకున్నారు. పాఠశాల ఉపాధ్యాయుల సేవలను కొనియాడుతూ కలెక్టర్ ప్రశంసా పత్రాన్ని వారికి అందజేశారు. పిల్లల ప్రతిభ అంశాల ఆధారంగా ఊషన్నపల్లి పాఠశాలను ఉత్తమ పాఠశాలగా ఎంపిక చేసిన జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖాధికారి, జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి, డీఆర్పిలు, ఇతర అధికారులకు ఈర్ల సమ్మయ్య, అమృత సురేష్ కుమార్ లు కృతజ్ఞతలు తెలియజేశారు. ఊషన్నపల్లి పాఠశాల పిల్లల్ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులను మండల విద్యాధికారి సిరిమల్ల మహేష్, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు నరెడ్ల సునీత, అధికారులు ప్రజాప్రతినిధులు, ఎఎపిసి చైర్మన్, సభ్యులు ఉపాధ్యాయులు, సీఅర్పీలు, పిల్లల తల్లిదండ్రులు, ఊషన్నపల్లి గ్రామస్తులు, యువజన సంఘాల నాయకులు, మహిళా సంఘాల సభ్యులు, మండల ప్రజలు, పలువురు అభినందించారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి