మరుగున నేత!..అచ్యుతుని రాజ్యశ్రీ

 మరుగున పడిన జాతీయ నేత
విద్యావేత్త! కార్మికుల కై తపించి
రెండు సార్లు ఆపద్ధర్మ ప్రధానిగా
కేవలం పదమూడు రోజుల పాలన!
 నెహ్రూ శాస్త్రీజీల దేహాంతం _ తాత్కాలిక ప్రధానిగా
నీపాత్ర అపురూపం!
కుళ్లు రాజకీయాలెరుగని సూటి సరళత్వం 
_బక్కపలచని దేహంలో కార్మిక సంక్షేమమే నీ అభిమతం
సియాల్ కోటలో జననం పరిశోధకునిగా ఆచార్యునిగా 
అలహాబాద్ యూనివర్శిటీలో వెలిగిన తేజం
పందొమ్మిదివందల యాభైరెండు నుంచి డెబ్భైరెండుదాకా ఎం.పి.గా
సాగిన పయనం
కార్మికులకై తపించిన వారిసమస్యలపై దృష్టిపెట్టిన గుల్జారీలాల్ నందాజీ 
భారతరత్నగా తొంభైతొమ్మిదో ఏట
అమరలోకానికి పయనం
ఉత్తరాయణంలో అహ్మదాబాద్ లో నందాజీ మరుగున పడిన నేతాజీ🙏
కామెంట్‌లు