న్యాయాలు -737
సలిలాదిత్య న్యాయము
*****
సలిలము అనగా ఉదకము, నీరు,జలము. ఆదిత్య అనగా సూర్యుడు, వేలుపు, దేవత, దైవం అనే అర్థాలు ఉన్నాయి.
జల సూర్యుని వలె.
వాస్తవానికి సూర్యుడు ఒక్కడే కానీ నీటిలోని తరంగాలలో ప్రతిఫలిస్తూ అంత మందిగా అంటే అనేక సూర్యులుగా కనిపిస్తూ వుంటాడు.
సూర్యుడు ఒక్కడే కానీ సముద్రంలో పడి లేచే తరంగాలను గమనిస్తే ఆ తరంగాలు అన్నింటిలో సూర్య బింబం కనిపిస్తుంది.
అక్కడే కాదు నేలమీద చెరువులు, కుంటలు, బావులతో పాటు ఎక్కడైతే సూర్యరశ్మి సోకే ప్రదేశాలలో నీళ్ళు కానీ అద్దాలు కానీ వుంటే వాటిల్లో సూర్యడి ప్రతిబింబాలు కనిపిస్తాయి. అలా కనిపించినంత మాత్రాన సూర్యుడు వేరు వేరు కాదు కదా. ఒక్కడే అనే అర్థంతో ఈ"సలిలాదిత్య న్యాయము"ను ఉదాహరణగా చెబుతుంటారు.
దీనిని భౌతిక చూసినట్లయితే వివిధ మతాల నమ్మకాల ప్రకారం వివిధ రూపాల్లో కాకుండా ఒకే రూపంతో అనేకంగా కనిపించడం అన్నమాట.
అందుకే సూర్యుడిని ప్రత్యక్ష దైవంగా భావిస్తారు.
దీనినే ఆధ్యాత్మిక వాదులు ప్రతి జీవిలోనూ తొణికిసలాడే జీవ చైతన్యాన్ని సూర్యుడిగా భావిస్తారు. జీవ చైతన్యం అంటే నిత్య సత్యమైన సజీవత్వం.ఈ విధంగా సకల జీవకోటికి ఆధారభూతమైన ప్రాణమే సూర్యుడు.
" ఉదయే బ్రహ్మ రూపశ్చ మధ్యాహ్నేతు మహేశ్వరః / అస్తకాలే స్వయం విష్ణుః త్రిమూర్తిశ్చ దివాకరః" అని ఋషులు సూర్యుని త్రిమూర్తి స్వరూపంగా కొలిచారు.
అయితే ప్రపంచ భౌతిక విజ్ఞాన శాస్త్ర వేత్తలు కూడా మరో కోణంలో ఖగోళ శాస్త్రాన్ని దృష్టిలో పెట్టుకొని నవగ్రహాలలో సూర్య గ్రహం ప్రధానమైనదిగా అంగీకరిస్తూ లోకానికి వెలుగు, వేడిని, సమస్త జీవకోటికి ఆధారభూతమైనవాడనే సామాన్య జనుల అభిప్రాయాన్ని సమర్థించారు.
ఇతిహాసాలు పురాణాలతో పాటు" అక్ష్యుపనిషత్తు"లో ప్రత్యేకంగా సూర్యుని గురించే రాసి వుంది."సూర్య ఆత్మా జగత్ సస్తుషస్యః అంటే 'జగత్తులోని ప్రాణులు అన్నింటికీ సూర్యుడే ఆత్మ' అని ఋగ్వేదం చెప్పింది.ఇలా ప్రశ్నోపనిషత్తు,ప్రకృతి వైద్య శాస్త్రం మొదలైనవన్ని కూడా సూర్యుడికి సమస్త జీవకోటికి ఉన్న అవినాభావ సంబంధాన్ని గురించి చెప్పాయి.
సహజ కవి బమ్మెర పోతనామాత్యుడు"ఒక్క సూర్యుడు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచుచున్నాడు" అన్నాడు.
రామాయణ మహా భారతాలలో కూడా సూర్య భగవానుడి గురించి ఉందన్న విషయం అందరికీ తెలిసిందే.
అద్దం ముక్కలలో అన్ని ప్రతి బింబాలు ఒకే విధంగా కనబడినట్లు సూర్యుడు కూడా ఒకే భావనతో ప్రజలందరికీ కనిపిస్తాడని తెలుసుకున్నాం.
మరి ఈ "జల సూర్య న్యాయం లేదా సలిలాదిత్య న్యాయము" ద్వారా 'మనం కూడా వ్యక్తి పరంగా,వ్యక్తిత్వ పరంగా గౌరవం, అభిమానం పొందాలని, మనదైన ఉనికిని చాటుకుంటూ ఎదుటి వారి మనసులో మనదైన ముద్ర వేయాలి.అంతే కదండీ!.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి