పౌష్య మాస పర్వ దిన
పంకజ దళ శోభలను
ఏర్చి కూర్చి కవితలల్లిన
కవివరేణ్యుల కందరికి
భోగి,సంక్రాంతి,కనుమ
శుభాకాంక్షలు.
పాఠక లోకమునకు
పదేపదే శుభాభినందనలు.
🍒
మూడు రోజుల పండుగలను
అంకిలి(విఘ్నం) లేకుండా
ఆచరించిన
ఆంధ్రులందరూ
మొలక "నవ్వుల
మోము తోడ
చిలకల వలె
పలికిరి మీ నోటి నిండుగా పరమార్లు పండుగ, పండుగ,
పండుగ అనుచు.
మీనోటి మాటతో కావలె
ప్రతిరోజు ఒక సంక్రాంతి పండుగ,
మన ఇళ్లు ,మనసులు సంతసముతో నిండగా.
మనలో
ఎన్నో కోర్కెలు ఈరిక
లెత్తినా
నన్నయ చెప్పినట్లు
*చతుష్క పుష్పవితతిన్" (ధర్మార్థ కామ మోక్షములు)
చెదలు సోకనియ్యక చూడవలె,కాపాడవలె. అప్పుడే, పండుగల పరమార్ధం,
మన గుండె లోతులను తాకినట్లు.
ఉత్తరాయణ రుచులు
(సూర్యకిరణాలు)
చురుకు చురుకుమని
తాకినప్పుడు తెలుసుకోవలె అందులో అంతరార్థం; మసలుకోవలె
మన కర్తవ్యదిశగా.
దినకరుని దినచర్య మనకు దిక్సూచిగా తలుచుకోందాం.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి