పెద్దకడబూరు మండల పరిధిలోని కంబదహాళ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న ప్రముఖ బాలసాహిత్యవేత్త ,బాలబంధు గద్వాల సోమన్నను "తెలుగు కీర్తి "పురస్కారం వరించింది.జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న వీరి ఖాతాలో మరో పురస్కారం జమ కావడం విశేషం.రమారమి 6 వసంతాల కాల వ్యవధిలో 63 పుస్తకాలు రచించి,పలు చోట్ల వాటిని ఆవిష్కరించిన గద్వాల సోమన్న అవిరళ కృషిని గుర్తించి తెలుగు భాష,సంస్కృతి,వైభవం,సాహిత్యం,కళల పరిరక్షణ కోసం 143 ఈవెంట్స్ తో ప్రత్యేక రీతిలో నిరంతరాయంగా శ్రమిస్తున్న ,ప్రభంజనం సృష్టిస్తున్న శ్రీశ్రీ కళావేదిక గౌరవ సి.ఇ. ఓ డా.కత్తిమండ ప్రతాప్ గారు తెలుఫు కీర్తి పురస్కారానికి సోమన్నను ఎంపిక చేశారు.తెలుగు అసోసియేషన్ ఆఫ్ తెలుగు అకాడమీ బుక్స్ ఆఫ్ రికార్డ్స్,వరల్డ్ ఫోరమ్ రైటర్స్,వరల్డ్ పోయెట్రీ అకాడమీ సంయుక్తంగా జనవరి 21 మంగళవారం-2025న నిర్వహించే కార్యక్రమంలో శ్రీ కౌత పూర్ణానంద్ విలాస్ శ్రీశ్రీ కళావేదిక-విజయవాడలో ఈ అవార్డు అతిరతిమహారథులు,కవులు,కళాకారులు, ఉపాధ్యాయుల సమక్షంలో కవి సోమన్న ఈ పురస్కారం అందుకోనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు.'తెలుగు కీర్తి' పురస్కారముకు ఎన్నికైన గద్వాల సోమన్న ను తోటి ఉపాధ్యాయులు, శ్రేయోభిలాషులు అభినందించారు.
'తెలుగు కీర్తి' పురస్కారానికి సోమన్న ఎంపిక

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి