జీవితంలో -
సంతోషాన్నే కోరుకుంటే ఎలా?
దుఃఖం వచ్చినప్పుడు -
ఎలా తట్టుకోగలవు?
జీవితంలో -
కష్టాలు ,కన్నీళ్లు కూడా ఉంటాయి,
వాటిని అక్కున చేర్చుకునేదెవరు?
సంతోషాన్ని ,దుఃఖాన్ని -
సమానంగా చూడాలి,
అప్పుడే జీవితంలో ,
ఆటుపోట్లను తట్టుకోగలవు!
సంతోషమైకంలో -
దుఃఖాన్ని చిన్నచూపు చూడకు,
దుఃఖం తర్వాత వచ్చే సంతోషమే
గొప్పగా ఉంటుంది...!
చీకటి తర్వాత వెలుతురు కోసం ,
వెలుతురు తర్వాత చీకటికోసం
ఎదురుచూస్తూ ఉంటాము కదా!
ఏదైనా ఎదురుచూసిన తర్వాత
దొరుకుతేనే దానికి విలువ
అదే సంతోషం కదా...!!
***
విలువ...!!-షాహీన్ సిద్దిఖా.- నల్లగొండ.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి