మేలుకొలుపులు(మత్తకోకిల)-డా.అడిగొప్పుల సదయ్య
19.
నేలవేల్పుగ పుట్టి రాజుల నేలమట్టము చేస్తివే 
నీలకంధర చాపమెక్కిడి నేలచూలిని కొంటివే 
హాలువై శకటారి తోడయి యగ్రజుండుగ నిల్తివే 
మేలి దైవమ,నిద్ర మానిక మేలుకో ధరనేలుకో!

నిఘంటువు:
నేల వేల్పు= బ్రాహ్మణుడు, పరుశురాముడు
నీలకంధరచాపము=శివ ధనుస్సు 
నేలచూలి= భూజాత,సీత
హాలుడు=బలరాముడు 
శకటారి=శ్రీకృష్ణుడు 

20.
వెల్ల యశ్వము వచ్చె మీదగు విశ్వరూపము చూడగా
తెల్ల హస్తియు వచ్చి నిల్చెను దేవరా,తమ ముంగిటన్ 
నల్ల యావును మిమ్ము జూడగ నందమొందుచు చేరెరా
మెల్లగా కనువిప్పి చూచుచు మేలుకో ధరనేలుకో!
-----------------------------------------
నిఘంటువు:
వెల్ల= తెలు

పు రంగు గల
నందము= సంతోషం
----------------------------------------
డాక్టర్ అడిగొప్పుల సదయ్య 
వ్యవస్థాపక అధ్యక్షుడు 
మహతీ సాహితీ కవిసంగమం 
కరీంనగరం
9963991125
కామెంట్‌లు