కంచి పరమాచార్య::- కొప్పరపు తాయారు

 కంచి పరమాచార్య ఆయన్నే అందరూ పెరిఅవరూ అంటారు
       ఈయన పుట్టినప్పుడు స్వామి వారి నాన్నగారు తనకు తెలిసిన  జాతకచక్రం చూడగల నిష్ణాతుడు అయిన స్నేహితుడుని
ఇంటికి ఆహ్వానించి ఈయన జాతకం ఆయన చేతి లో పెట్టి తన పుత్రుడి జాతకం ఎలా ఉంది
 అని అడుగుతారు.
        ఆయన జాతకం అంతా చక్కగా రాసి
పరిశీలించి లెక్కలు కట్టి, శ్రీ ఆచార్యులు వారి 
తల్లి గారిని పిలిచి అమ్మా! మంచి తీర్థం తెచ్చి 
పెట్టమ్మా! అని అడిగారుట.
               ఆమే అచ్చెరువంది ,ఏమీ మాట్లాడకుండా మనసులో సందేహం మనసులో
పెట్టుకుని మంచి తీర్థం ఆయనకు ఇచ్చారట.
వెంటనే ఆ జ్యోతిష్యడు ఆ నీటిని  పోసి చిన్న బిడ్డ గా ఉన్న  స్వామి వారి పాదాలు కడిగి ఆ నీరు 
తన తలపై ఝల్లు కుని సాష్టాంగ దండ ప్రణామం
చేశారట ఆ చిన్న స్వామికి.అప్పుడు వారి అమ్మ గారి. వైపు తిరిగి .ఆ జ్యోతిష్యలు వారు
ఈ బిడ్డ జగద్గురు వవుతాడమ్మా! ఎంతమంది కో
ఆదర్శప్రాయుడు అవుతాడు.కారణ జన్ముడు.
అటువంటి నీ బిడ్డ పెద్దయ్యేదాకా ఉంటానో లేదో
అందుకే నేను ఇప్పుడే నమస్కరించు
కుంటున్నాను అన్నారట.పరమాచార్యుల వారు
అంతటికీ మహాను బావుడు.
               *****
కామెంట్‌లు