చేయని తప్పుకు శిక్షలు
ఎరుగని శాపపు ఫలితాలు
తెలియని విషయ పరీక్షలు
కలిసిన జీవిత గమనాలు..
ఆశించినది అందదు
అందినవి ఉండవు
అనుకున్నవి అవవు
ఆరాటాలు అసలు ఆగవు
చేతిలో ఏమీ లేదని
చింతిస్తే జరగదు
చేవ మిగిలేవున్నదని
చివరివరకు మరువకు.
జీవితం నీదయితే
కష్టం కూడా నీదే!
గాయం నీదైతే
బాధ కూడా నీదే!
ఓదార్పులు ఊరటలు
తపోప్పుల విశ్లేషణలు
తీవ్రతను ఆపగలవు
పరిణామాలను కాదు!
ఏది వచ్చినా అది నీది
స్వాగతించు సర్వము
అది కూడా కదిలిపోవును
నిలిచిపోదు కలకాలం!
ఎదుర్కొనే ధైర్యము
తట్టుకునే స్థైర్యము
ప్రసాదించు దైవము
ప్రకాశంతో ఉదయమే!
సర్వం తెలిసిన సాక్షి కి
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి