పల్లకి ఎక్కిన పిల్లులు:- ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట
పిల్లి పిల్లల చూశారా 
ఇల్లు ఇల్లు తిరిగాయి 
పల్లెను చుట్టి వచ్చాయి
పల్లకి మీద ఎక్కాయి 

పిల్లలు అచటికి వచ్చారు 
పిల్లులనేమో చూశారు 
పల్లకి పైకి లేపారు 
మెల్లిమెల్లిగా నడిచారు 

గొల్లు గొల్లున నవ్వుతూ
గల్లీ గల్లీ తిప్పారు 
పల్లె ప్రజలు తిలకించి 
మల్లెపూలు చల్లారు 

చిన్నగా పిల్లలు వెళ్లారు 
పల్లకి అచ్చట దించారు 
పాపలందరు వచ్చారు 
పాలు పోసి మురిశారు


కామెంట్‌లు