జాతీయ ఓటర్ల దినోత్సవం : -కిలపర్తి దాలినాయుడు

 సీ
గణతంత్రభాగ్యమై కల్గిన ఓటుచే 
రాజ్యాధికారమ్ము ప్రజల హక్కు
జనవాణి కనుగొని తనవాణి వినిపించ
గలవారినెన్నిన గలుగు మేలు
ధన,కనకాదులు దరిజేరియిచ్చినన్ 
కుమతులకోటును గూర్చబోకు 
మంచిచెడ్డలనెంచి మరిమరి యోచించి 
వేయవలయునోటు దాయవదు!
తే.గీ.
త్యాగములొనర్చితెచ్చిన హక్కుగాదె
పౌరులకువరమైనట్టి వ్రాతగనుక
జాతి నిర్మాణచణులార!జాగృతులయి
యోటువేయుడు మంచికి  పాటు బడుడు!
----------------------------------

కామెంట్‌లు