ఓ కవితా!:- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్,భాగ్యనగరం
నీ కొరకే
నా ఊహలు
నీ కోసమే
నా కలలు

నీ కొరకే
నా అక్షరకూర్పులు
నీ కోసమే
నా పదప్రయోగాలు

నీ కొరకే
నా పడిగాపులు
నీ కోసమే
నా ప్రయత్నాలు

నీ కొరకే
నా ప్రాసలు
నీ కోసమే
నా పోలికలు

నీ కొరకే
నా కలము
నీ కోసమే
నా కాగితము

నీ కమ్మదనమే
నా ఆశయము
నీ మాధుర్యమే
నా లక్ష్యము

నీ కొరకే
నా దేహము
నీ కోసమే
నా ప్రాణము

నీ కొరకే
నా చేతలు
నీ కోసమే
నా రాతలు


కామెంట్‌లు